Telangana: మొన్నటి వరకు ఉద్యోగాలకు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం లేదని, కేసీఆర్ యువతకు ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని అంతా అంటున్న నేపథ్యంలో, ఇప్పుడు అధికారులు వరుసగా నోటిఫికెషన్స్ విడుదల చేస్తున్నారు. నిన్న గ్రూప్ 4 పోస్టులకు అప్లై ప్రారంభం అయ్యింది. మొన్న గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. నిన్న గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చింది. ఇలా దాదాపు రోజుకో నోటిఫికేషన్ ఇస్తూ యువతకు సంతోషకరమైన విషయాలను ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు గ్రూప్ 3 నోటిఫికేషన్ లో భాగంగా 1365 పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వచ్చే నెల 24 నుండి అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ డిపార్ట్‌మెంట్: 27
ఎనిమల్ హస్బెండ్రీ, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీష్: 02
బ్యాక్వార్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 27
ఎనర్జీ డిపార్ట్‌మెంట్: 02
ఎన్వీరాన్మెంట్, ఫారెస్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్: 07
ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్: 712
ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్: 16
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్: 46
హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 39
హైయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్: 89
హోం డిపార్ట్‌మెంట్: 70
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్: 25
ఇరిగేషన్ అండ్ కామండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్‌మెంట్: 01
లేబర్ అండ్ ఎప్లాయ్ మెంట్ డిపార్ట్‌మెంట్: 33
మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 06
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్: 18
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ : 29
ప్లానింగ్ డిపార్ట్‌మెంట్: 03
రెవెన్యూ డిపార్ట్‌మెంట్: 73
షెడ్యూల్ క్యాస్ట్స్ డెవలప్మెంట్ డిపార్ట్‌మెంట్: 36
సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్: 56
ట్రాన్స్ పోర్ట్, రోడ్, బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్: 12
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 27
ఉమెన్, చిల్డ్రెన్, డిసబెల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్‌మెంట్: 03
యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజమ్ అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్: 05
ట్రైబల్ వెల్ఫేర్(ట్రైకోర్): 01
ఇలా వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయని యువత సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే గ్రామాల నుండి యువత కోచింగ్ కోసం సిటీలకు వస్తున్నారు. దాదాపు అన్ని ఇన్స్టిట్యూట్స్ స్టూడెంట్స్ తో నిండిపోయాయి. ఇంకా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ మాత్రమే కాకుండా ఇంకా డీఎస్ఈ, గురుకుల నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఇప్పటికే టెట్ పరీక్షను కండక్ట్ చేసిన ప్రభుత్వం, ఇంకా డీఎస్ఈకు కూడా నోటిఫికేషన్ ఇస్తే, అందురు విద్యార్థులు హ్యాపీ ఫీల్ అవుతారు.