Nisha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగర్వాల్ సిస్టర్స్ కి ఉన్నటువంటి గుర్తింపు మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ముందుగా బాలీవుడ్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్గా సెటిల్ అయింది. ఆ తర్వాత తన సోదరి అయిన నిషా అగర్వాల్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే ఈ అమ్మడు కూడా తన అక్క మాదిరిగానే బాగానే క్లిక్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ నిషా అగర్వాల్ మాత్రం అరడజను సినిమాల్లో నటించగానే నటనకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఈ క్రమంలో ఈ అమ్మడు ముంబైకి చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తని ప్రేమించే పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.
కాగా నటి నిషా అగర్వాల్ గురించి ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాలలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే మరి నిషా అగర్వాల్ మళ్లీ ఇండస్ట్రీలో రాణించేందుకు సిద్ధమవుతుందట. కానీ ఈ విషయం తన భర్త కి నచ్చలేదని దీంతో తన భర్తతో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయని దాంతో విడాకులు తీసుకునేందుకు కూడా సిద్ధపడినట్లు కొందరు చర్చించుకుంటున్నారు. అందుకే ఇటీవల కాలంలో నిషా అగర్వాల్ సోషల్ మీడియా మాధ్యమాలలో ఘాటుగా అందాల ఆరబోస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆఫర్లు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుందని టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. కానీ నటి నిషా అగర్వాల్ సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ విడాకుల విషయంలో వైరల్ అవుతున్న రూమర్స్ లో మాత్రం నిజం లేదని మరికొందరు అభిమానులు అంటున్నారు. అయితే ఇప్పటివరకూ వీరిద్దరి మధ్య ఎలాంటి కలహాలు, విబేధాలు లేకుండా వెరీ కాపురం సాగిపోతోందని అలాగే విడాకులు తీసుకుంటున్నట్లు వినిపిస్తున్న వార్తలు కేవలం గాలి వార్తలేనని కొట్టి పారేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి నిషా అగర్వాల్ తెలుగులో ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఏమైంది ఈ వేల అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లో కెరియర్ ని ఆరంభించి సోలో, సుకుమారుడు, ఇష్టం(తమిళ్), తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించి బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించలేకపోయింది. కాగా చివరిగా నటి నిషా అగర్వాల్ మలయాళీ భాషలో తెరకెక్కిన కజిన్స్ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మడికి సంబందించిన ఎలాంటి సినీ సమాచారం లేదు.