Tamanna : మాములుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రేటీల గురించి ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు ఊరు పేరు లేని బేస్ లెస్ రూమర్లు వినిపించటం సహజం. అయితే ఇలాంటి రూమర్లకి చాల మంది సినీ ప్రముఖులు పట్టించుకోరు సరి కదా కానీసం పట్టించుకోరు కుడా… కానీ ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం ఎక్కువవుతుడటంతో సినీ ప్రముఖలకు సంబందించిన ఎలాంటి విషయం అయినా యిట్టె వైరల్ అయిపోతోంది. దీనికితోడు ఎవరైనా సెలబ్రేటీ బయట కనిపించిందంటే చాలు వారి వ్యక్తిగత విషయాల గురించి అడిగి ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కుడా లేకపోలేదు.

అయితే తెలుగులో దాదపుగా అందరి స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించి బాగానే అలరించిన తమన్నా భాటియా గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి 30 ఏళ్ళ వయసు పైబడినా ఇంకా సింగల్ స్టేటస్ నే మెయింటేన్ చేస్తోంది. అలాగే ప్రేమ, పెళ్లి వంటి విషయలను కూడా అచల గోప్యంగా ఉంచుతోంది.

దీంతో గత కొద్ది రోజులుగా నటి తమన్నా ప్రేమ, పెళ్లి వంటి విషయాల గురించి పలు రూమర్లు, గాసిప్స్ వంటివి ఇంటర్నెట్ మాధ్యమలాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వార్తలకి చెక్ పెట్టేందుకు నటి తమన్నా భాటియా మీడియా ముద్ను క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ విలేఖరి మీ పెళ్లి గురించి వినిపిస్తున్న వార్తలు నిజమేనా అని అడగ్గా ఫన్నీ గా రియాక్ట్ అయ్యింది. ఇందులో భాగంగా తనకి ఇప్పటికే బిజినెస్ మెన్ అలాగే డాక్టర్ తో కొందరు పెళ్లి చేసేసారని ఇప్పటికే ఈ విషయాలు తనకి తెలియకపోయినా అందరికీ తెలుసని సెటైరికల్ గా పంచులు విసిరింది. అలాగే పెళ్ళికి నాకు లేని తొందర మీకేందుకని కు ప్రశ్నించింది. దీంతో నటి తమన్నా భాటియా పెళ్లి గురించి వినిపిస్తున్న వార్తలకి పులి స్టాఫ్ పడింది.

అయితే ఈ విష్యం ఇలా ఉండగా నటి తమన్నా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. దీంతో ఈ బ్యూటీ కి ఆఫర్లు కరువైనట్లు సమాచారం. కాగా ఆ ఆమధ్య నటి తమన్నా బబ్లీ బౌన్సార్ అనే చిత్రంలో నటించింది. కాగా ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో విడుదలైంది. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే చాలామంది ఈ చిత్రం కనీసం ఈ చిత్రం రిలీజ్ అయినట్లు కూడా తెలీదు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on డిసెంబర్ 7, 2022 at 9:03 సా.