Hema: పలు టాలీవుడ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నటువంటి తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి హేమ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్ అవ్వాలని ప్రయత్నించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో నటించినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుందని చెప్పవచ్చు.
అలాగే నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కూడా మెంబర్ గా ఉంటూ కీలక పదవి బాధ్యతలను చేపట్టి సేవలు కూడా అందించింది. ఈ మధ్యకాలంలో నటి హేమ తన కుటుంబ బాధ్యతలపై దృష్టి సారించడంతో సినిమాలకి కొంతమేర దూరంగా ఉంటుంది.. కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ తన అభిమానులను బాగానే అలరిస్తోంది.
అయితే తాజాగా మరో తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నటి జయలక్ష్మి తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే నటి హేమ కొంతమేర మోడ్రన్ దుస్తులు ధరించి బోర్డుగా కనిపించింది. అయితే ఇదే వీడియోలో తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూడా నటి హేమతో కలిసి సరదాగా ఇంగ్లీష్ పాటకి స్టెప్పులేస్తుంది. అయితే నటి జయలక్ష్మి మాత్రం సాంప్రదాయబద్ధంగా చీరకట్టులో కనిపించింది.
అలాగే ఈ వీడియో కి ఏకంగా నా డార్లింగ్ హేమ తో డాన్స్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వయసులో నటి హేమకి మోడ్రన్ దుస్తులు అవసరమా అని అలాగే నటి జయలక్ష్మి చక్కగా సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా వయసుకి ఇంకా మోడ్రన్ గా కనిపించడానికి ఏమాత్రం సంబంధం లేదని కాబట్టి మహిళలకి తమకి సౌకర్యంగా ఉన్నటువంటి దుస్తులు ధరించే హక్కు ఉంటుందని స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి జయ లక్ష్మి కూడా తన కుటుంబ బాధ్యతలను చక్కబట్టే పనుల పడడంతో సినిమాలకి పూర్తిగా బ్రేక్ ఇచ్చింది అందుకే ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు. కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం బాగానే ఆక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఇలా తనకు సంబంధించిన అందమైన ఫోటోలు వీడియోలు వంటివి షేర్ చేస్తూ తన అభిమానులని బాగానే అలరిస్తోంది.