Director: సినిమా అంటే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో కాస్త అందంగా, అభినయంగా ఉంటే చాలు చాలామంది తమ కోరికలు తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ సంఘటనలు కేవలం ఆడవాళ్ళ జీవితంలో మాత్రమే కాదు ఈ మధ్య మగవాళ్ళ జీవితంలో కూడా బాగానే ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. అయితే వయసులో ఉన్నప్పుడు ఆఫర్లు రాక సరైన గుర్తింపు తెచ్చుకోక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితమైన యంగ్ ఏజ్ ఉన్న కొంతమంది నటీమణులకు సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు దర్శక నిర్మాతల నుంచి లేదా ఇతర టెక్నీషియన్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాలు కూడా దాదాపుగా అందరికీ తెలిసి ఉంటుంది. కాగా తాజాగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఇంతకీ ఆ వ్యవహారం ఏంటంటే 45 ఏళ్ల పైబడిన ప్రముఖ డైరెక్టర్ కి క్యారెక్టర్ ఆర్టిస్టులపై మోజు ఎక్కువని దాంతో తన గత సినిమాల్లో ఆఫర్లు ఇచ్చిన ఆర్టిస్టులకి తన తదుపరి చిత్రాల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడని కొందరు తగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏకంగా ఈ డైరెక్టర్ కారణంగా డబ్బులు బాగానే వెనకేసుకుందని, అంతేగాకుండా ఇప్పటికే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌజ్ నిర్మించి అప్పుడప్పుడు పలు రకాల షోలు, ఈవెంట్లకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తుందని టాక్.
అయితే ఈ క్యారెక్టర్ భర్త కూడా గతంలో సినిమాలకి అలాగే సీరియల్స్ కి సహనిర్మాతగా వ్యవహరించి కొంతమేర ఆర్థిక నష్టాల పాలయ్యాడని,దీంతో ఆస్తిపాస్తులను కోల్పోయాడని అందుకే డైరెక్టర్ ద్వారా తన ఆర్థిక నష్టాలను పూడ్చుకుంటూ ఉందని కథలు కథలుగా వినిపిస్తున్నాయి. చివరికి ఆ డైరెక్టర్ వ్యవహారం కాస్త టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారడంతో ఓ పెద్ద ప్రాజెక్టు కూడా ఆగిపోయినట్లు సమాచారం.
ఈ విషయం ఇలా ఉండగా ఆ డైరెక్టర్ గతంలో టాలీవుడ్ లో పేరు మోసిన ఓ ప్రముఖ హీరోకి నాలుగు హిట్లు ఇచ్చాడట. దీంతో ఈమధ్య ఈ డైరెక్టర్ వ్యవహారం ఆ స్టార్ హీరో చెవిన పడటంతో ఇంటికి పిలిచి మరి వార్నింగ్ ఇచ్చాడట. అలాగే కెరియర్ పై దృష్టి సారించి మరో మంచి కథతో వస్తే తానే హీరోగా నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చాడని టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ ఇండస్ట్రీలో చెడు వ్యసనాలకి అలాగే మగువలకి దూరంగా ఉంటేనే లైఫ్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఏదో ఒక రోజు కనుమరుగవ్వడం ఖాయం.