Srikanth : తెలుగు చలన చిత్రంలో దాదాపుగా 15ఏళ్ళకి పైగా హీరోగా నటిస్తూ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ నటుడు శ్రీకాంత్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన వసరం లేదు. అయితే నటుడు శ్రీకాంత్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే పలు మంచి సేవా కార్యక్రమాలు చేసి రియల్ లైఫ్ లో కూడా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా గత రెండు రోజులుగా హీరో శ్రీకాంత్ తన భార్యకి విడాకులు ఇవ్వబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే హీరో శ్రీకాంత్ మరియు ఇతడి భార్య ఊహా కి మనస్పర్థలు విభేదాలు మొదలయ్యయాన్ని దాంతో గత కొన్ని రోజులుగా వీరిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారని ఇలా కథలుకథలుగా చర్చించుకుంటున్నారు.
దీనికితోడు ఇప్పటివరకూ ఈ విషయంపై ఇటు ఊహా గాని అలాగే హీరో శ్రీకాంత్ గానీ స్పందించకపోవడంతో ఈ విడుకుల మ్యాటర్ రోజురోజుకి తెగ వైరల్ అవుతోంది. దీంతో తాజాగా టాలీవుడ్ ప్రముఖ సినీ జర్నలిస్ట్ సీనియర్ పాత్రికేయులు ప్రభు ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ ద్వారా స్పందించారు. ఇందులో భాగంగా హీరో శ్రీకాంత్ విడాకులు తీసుకోబోతున్నట్లు వినిపిస్తున్న వార్తలపై మీ స్పందన ఏమిటని ఇంటర్వ్యూ చేసే యాంకర్ అడగ్గానే వెంటనే నవ్వేసారు. అలాగే తాను హీరో శ్రీకాంత్ వ్యక్తగత పీ.ఆర్.ఓ అని అలాగే అంతకంటే మొదటిగా హీరో శ్రీకాంత్ నా సన్నిహితుడు, మంచి స్నేహితుడని కుడా తెలిపాడు.
ఇక ఈ విడాకుల విషయం గురించి తెలిసి వెంటనే హీరో శ్రీకాంత్ కి ఫోన్ చేసానని దాంతో హీరో శ్రీకాంత్ విడాకుల విషయం చెప్పగానే వెంటనే పగలబడి నవ్వడాని తెలిపాడు. అలాగే తాము ప్రస్తుతం చాల హ్యాపీ గా ఉన్నామని కొందరు తమ స్వార్థం కోసం ఇలాంటి టప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు కుడా చెబుతూ సీరియస్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. దీంతో హీరో శ్రీకాంత్ విడాకుల విషయానికి సంబందిచిన ఫేక్ వార్తలకు దాదాపుగా పులిస్టాప్ పడింది. ఈ విషయం ఇలా ఉండగా నటుడు శ్రీకాంత్ కి ఈ ఆమధ్య ఇండస్ట్రీలో హీరోగా అవకాశాలతో మార్కెట్ తగ్గడంతో విలన్ పాత్రలలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ మధ్య ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రంలో విలన్ గ నటించాడు. ఈ చిత్రం మంచి హిట్ అవ్వడంతో విలన్ గా మంచి మార్కులతోపాటూ ఆఫర్లు కూడా కొట్టేసాడు. దీంతో ప్రస్తుతం శ్రీకాంత్ వరుస సిన్మాల్లో నటిస్తూ షూటింగులలో బిజీబిజీగా గడుపుతున్నాడు.