Rakul Preet Singh: టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమంలో దాదాపుగా అందరి స్టార్ హీరోలు నటించింది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ అమ్మడికి టాలెంట్ కి ఎలాంటి కొదవ లేకపోయినప్పటికీ లక్ సరిగ్గా లేకపోవడంతో కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్లు లేవు. అయినప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ కి ఆఫర్లపరంగా ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే ఈ అమ్మడు ప్రస్తుతం 30 ఏళ్ల వయసు పైబడినప్పటికీ అందం, అభినయం, అలాగే మంచి ఫిట్నెస్ వంటివి మెయింటైన్ చేస్తూ వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది. తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఇండస్ట్రీ గురించి మరియు సినిమా ఇండస్ట్రీకి వచ్చేటువంటి నూతన నటీనటుల గురించి మన ఆసక్తికర కామెంట్లు చేసింది.
ఇందులో భాగంగా డబ్బు సంపాదించాలనే ఆశయంతో ఇండస్ట్రీకి రావద్దని, తమ ప్రతిభను నిరూపించుకోవాలనే తపన, కోరిక ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఒక్కోసారి టాలెంట్ ఉన్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశాలు రావడానికి కొంచెం టైం పడుతుందని, కాబట్టి ఓపిగ్గా ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుందని నూతన నటీనటులకు సూచనలు ఇచ్చింది. ఇక అడ్డుదారుల్లో ఆఫర్లు దక్కించుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో రోజు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని కూడా తెలిపింది. పక్క వాళ్ళ సంగతి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అలా కాకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం అలాగే అనవసర విషయాలలో తల దురచడం వంటివి చేసినా కూడా ప్రమాదమేనని హెచ్చరించింది.
ఇక తన పెళ్లి విషయం గురించి స్పందిస్తూ ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే సమయం మరియు ఉద్దేశం రెండు లేవని స్పష్టం చేసింది. అలాగే తన చేతిలో ప్రస్తుతం చాలా ఆఫర్లు ఉన్నాయని, కాబట్టి ఆ సినిమాలు పూర్తి చేసేంతవరకు తాను పెళ్లి చేసుకోనని తెలిపింది. ఇక సోషల్ మీడియా మాధ్యమాలలో తన పెళ్లి పై జరుగుతున్న చర్చలు గురించి కూడా స్పందిస్తూ తనపై పెట్టిన శ్రద్ధ తమ జీవితాలను బాగు చేసుకునేందుకు పెడితే కనీసం జీవితమైనా బాగుంటుందని సరదాగా కౌంటర్ ఇచ్చింది.