CCL: నిన్న విజయవాడలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భోజ్ పూరి దబాంగ్స్ , తెలుగు వారియర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తెలుగు వారియర్ గణ విజయాన్ని సాధించింది. లాస్ట్ మంత్ 18న ప్రారంభమైన ఈ సీజన్ నిన్నటితో ముగిసింది. నిన్న జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్ లో భోజ్ పూరి దబాంగ్స్ 10 ఓవర్లలకు గాను 6 వికెట్స్ నష్టానికి 72 పరుగులు చేశారు. తెలుగు వారియర్స్ కూడా పది ఓవర్లలో నాలుగువికెట్స్ నష్టానికి 104 పరుగులు చేసింది. తరువాత 10 ఓవర్స్ లో భోజ్ పూరి టీం ఆరు వికెట్స్ నష్టానికి 89 పరుగులు చేసింది, తెలుగు టీం ఒక్క వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. ఇలా మొత్తానికి 20 ఓవర్లు కు గాను భోజ్ పూరి టీం 161 పరుగులు చెయ్యగా, తెలుగు టీం 162 పరుగులు చేసి, విజయాన్ని సాధించింది.

మొదట 10 ఓవర్లలలో భోజ్ పూరి టీం నుండి ఆదిత్య 26 పరుగులు, ఉదయ్ 10 పరుగులు, అస్గర్ 11 పరుగులు చెయ్యగా, మిగితా పరుగులు మిగితా టీం చేసింది. అలాగే తెలుగు టీం నుండి అఖిల్ అక్కినేని 67పరుగులు, ప్రిన్స్ 10 పరుగులు, రఘు 10 పరుగులు, రోషన్ 7 పరుగులు చెయ్యగా మిగితా పరుగులు మిగితా వాళ్ళు కొట్టారు. తరువాత 10 ఓవర్లలో ఆదిత్య 31, ఉదయ్ 34 పరుగులు చెయ్యగా, మిగితా రన్స్ టీం మెంబెర్స్ సాధించారు. అశ్విన్ 31, సచిన్ జోషి 14, తమన్ 10 పరుగులు చేసి, టీం ను విజయంవైపు నడిపించారు. తెలుగు వారియర్స్ టీం ఇప్పటికే 3 సార్లు CCL కప్ ను గెలిచారు, ఇప్పుడు నాలుగోసారి కూడా తెలుగు వారియర్స్ గెలిచారు.
టీమ్స్
——-
భోజ్‌పురి దబాంగ్స్: మనోజ్ తివారీ (కెప్టెన్), రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్, రామ్ ప్రవేశ్ యాదవ్, ఉదయ్ తివారీ, అజోయ్ శర్మ, విక్రాంత్ సింగ్, ఆదిత్య ఓజా, ప్రకాష్ జైస్, అయాజ్ ఖాన్, శైలేష్ సిన్హా, వైభవ్ రాజ్, అస్గర్ రషీద్ ఖాన్, వికాస్ సింగ్ , అక్బర్ నఖ్వీ, గజేందర్ ప్రతాప్ ద్వివేది, జై ప్రకాష్ యాదవ్, రాజ్ చోహన్, పవన్ సింగ్, బాబీ సింగ్, ప్రదీప్ పాండే, యశ్ కుమార్
తెలుగు వారియర్స్: అఖిల్ అక్కినేని (కెప్టెన్), వెంకటేష్, సచిన్ జోషి, సుధీర్ బాబు, తరుణ్, ప్రిన్స్ సిసిల్, సాయి ధరమ్ తేజ్, అజయ్, ఈఎస్‌డి, అశ్విన్ బాబు, ఆదర్శ్ బాలకృష్ణ, నందకిషోర్, నిఖిల్, సిద్దార్థ్, ప్రభు, రఘు, సుశాంత్, శ్రీకాంత్, తారక రత్న, సామ్రాట్ రెడ్డి, విశ్వ