Naga chaithanya : అక్కినేని ఫ్యామిలీ హీరో లాఛింగ్ అంటే భారీ స్థాయిలో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్నపూర్ణ స్టూడియో అధినేత అయిన అక్కినేని నాగార్జున తనయుడు..లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు మనవడు..పెద్ద నిర్మాణ సంస్థ అంటే ఇండస్ట్రీ వర్గాలలో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాగే నాగ చైతన్య టాలీవుడ్ ఎంట్రీ అన్నప్పుడు కూడా అందరిలో ఇదే ఆతృత నెలకొంది. చైతూ హీరో ఎంట్రీకి రెండేళ్ల ముందు నుంచే నాగార్జునను ఒకటే ప్రశ్నలతో ఊపిరాడనివ్వలేదు. చైతూ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని అడగడం మొదలు పెట్టారు. నాగార్జున మంచి సమయం కోసం మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాని చెప్పుకుంటూ వచ్చారు.

That is why Naga Chaitanya's debut movie flops ..!
That is why Naga Chaitanya’s debut movie flops ..!

ఎట్టకేలకి నాగ చైతన్యను హీరోగా లాంచ్ చేయాలని డిసైడయ్యారు. అయితే సొంత బ్యానర్ లో కాకుండా మరో ప్రొడ్యూసర్ కి నాగ చైతన్య ఎంట్రీ బాధ్యతలు నాగార్జున అప్పజెప్పడం హాట్ టాపిక్ అయింది. కొడుకును సొంత నిర్మాణ సంస్థలో ఎందుకు లాంచ్ చేయడం లేదనే గుసగుసలు వినిపించాయి. అయితే టాలీవుడ్ లో దిల్ రాజు సక్సెస్ ఫుల్ నిర్మాతగా మంచి క్రేజి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. లక్కీ హ్యాండ్ అనే పేరుంది. డిస్ట్రి బ్యూటర్స్ గా నిర్మాతగా సూపర్ సక్సెస్ లో ఉంది మంచి ఫాం లో ఉన్నాడు. అందుకే నాగ చైతన్య ఎంట్రీని బాధ్యతను నాగార్జున దిల్ రాజుకి అప్పచెప్పాడు. రంగం సిద్దమైంది. సీనియర్ స్టార్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా లాంచ్ చేయాలని డిసైడయ్యారు.

Naga chaithanya : సినిమా మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది. బట్ డోంట్ వరీ ఐయాం విత్ యూ అని చెప్పారట దిల్ రాజు.

ఫైనల్ గా జోష్ టైటిల్ తో నాగ చైతన్య – కార్తీకల డెబ్యూ సినిమా మొదలైంది. వాసు వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అందుకు కారణం ముఖ్యంగా కథ. నాగార్జున నటించిన శివ సినిమా ఇన్స్పిరేషన్ తో జోష్ సినిమాను తెరకెక్కించారు. చైతు లాంచింగ్ మూవీకి ఇదే పెద్ద మైనస్ అయింది. నాగార్జున మాదిరిగా లుక్స్ కూడా మెయింటైన్ చేశాడు చైతు. కానీ సినిమా ప్రేక్షకులను ఎంత మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దిల్ రాజుకి ఒకరకంగా ఇది పెద్ద షాక్. ఫస్ట్ కాపీ చూసినప్పుడే డిస్ట్రిబ్యూటర్స్ కి తేల్చి చెప్పాడు. సినిమా మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది. బట్ డోంట్ వరీ ఐయాం విత్ యూ అని చెప్పారట. ఆ తర్వాత చైతూ చేసిన ఏ మాయ చేశావే
పెద్ద హిట్ గా నిలిచింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 13, 2021 at 9:15 ఉద.