Nayanatara with Shahrukh Khan

Nayanthara : సౌత్ స్టార్ హీరోయిన్ నయనతారకి ఇప్పుడున్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. ఈరోజు ఇంతటి క్రేజ్ ఉన్న నయనతార సినిమాలలోకి రావాలని ఎప్పుడు అనుకోలేదట. చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. ఖడ్గం సినిమాలో సంగీత చెప్పే డైలాగ్ మాదిరిగా ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్..నేనేంటో చూపిస్తా అని అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ నయనతార మాత్రం ఒకే ఒక్క సినిమా చేసి వెళ్ళిపోదామనుకుంది. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసేది. ఆ సమయంలో ఆమెని చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ‘మనస్సినక్కరే’ అనే సినిమాలో హీరోయిన్‌గా మొదటిసారి అవకాశం ఇచ్చాడు.

That is why Nayantara does not come for promotions
That is why Nayantara does not come for promotions

వాస్తవంగా ఈ సినిమా తర్వాత నయనతార మళ్ళీ సినిమాలలో నటించకూడదనుకుంది. కానీ మొదటి సినిమాకి వచ్చిన క్రేజ్‌తో వరుసగా మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలలో నటించే అవకాశం రావడంతో కాదనలేకపోయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలో అవకాశం అందుకుంది. కెరీర్ ప్రారంభంలోనే ఇలా సూపర్ స్టార్స్‌తో నటించే అవకాశం అందుకొని స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాంతో ఇక కంటిన్యూ అయింది. తెలుగులో స్ట్రైట్ సినిమా విక్టరీ వెంకటేశ్ నటించిన లక్ష్మీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో నెక్స్ట్ నాగార్జున, ప్రభాస్‌లతో నటించే అవకాశం అందుకుంది. ఇలా తెలుగు, తమిళ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది.

Nayanthara : నయనతార నటించిన ఓ సినిమా ఫంక్షన్ కి వెళితే అది ఫ్లాప్‌గా మిగిలిందట.

ఇప్పటికే సౌత్ స్టార్స్ అందరితోనూ నటించేసింది. ప్రస్తుతం నయనతార రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్. సీనియర్ స్టార్ హీరోలకి నయనతార పర్‌ఫెక్ట్ జోడీ. అందుకే ఎక్కువగా రజనీకాంత్, మెగాస్టార్ లాంటి వారితో నటిస్తోంది. ఇలా భారీ క్రేజ్ ఉన్న నయనతార తను నటించిన సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం రాదు. ఇది దర్శక, నిర్మాతలకి, హీరోలకి కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. ఎన్నో సినిమాల విషయంలో నయన్ ని బ్రతిమాలినా ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పినా ఆమె మాత్రం నో చెబుతోంది. అందుకు కారణం తనకి ఎదురైన ఓ సంఘటన అని కవర్ చేస్తోంది. గతంలో ఆమె నటించిన ఓ సినిమా ఫంక్షన్ కి వెళితే అది ఫ్లాప్‌గా మిగిలిందట. అందుకే ఇది సెంటిమెంట్‌గా భావించి అప్పటి నుంచి తాను నటించిన సినిమా ప్రమోషన్స్‌కి వెళ్ళడం లేదని చెప్పుకొస్తోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 11, 2021 at 12:00 సా.