Uday kiran : టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. హీరోగా ఎంత పాపులర్ అయ్యాడో తన పెళ్ళి విషయంలో, మృతి తర్వాత అంతగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. తేజ దర్శకత్వంలో చిత్రం సినిమా ద్వారా హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యాడు ఉదయ్ కిరణ్. ఇందులో రీమా సేన్ హీరోయిన్ గా నటించిది. దర్శకుడిగా తేజ, హీరోయిన్స్ ఉదయ్ కిరణ్, రీమా సేన్ లకి ఇది డెబ్యూ సినిమా. ప్రముఖ నిర్మాత రామోజీ రావు ఈ సినిమాని నిర్మించారు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్ళు రాబట్టి సంచలనం అయింది.

That star director could not find a theater for the film because of Uday Kiran film
That star director could not find a theater for the film because of Uday Kiran film

ఈ సినిమా తర్వాత ఉదయ కిరణ్ టాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యాడు. చిత్రం తర్వాత మళ్ళీ తేజ – ఉదయ కిరణ్ కాంబినేషన్ లో నువ్వు నేను వచ్చింది. అనిత ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలతో కొన్నేళ్ళ పాటు యూత్ లవ్ స్టోరీస్ వచ్చాయంటే ఎంతగా వీటి ప్రభావం ఉండిందో అర్థం చేసుకోవచ్చు. దాంతో ఉదయ్ కిరణ్ స్టార్ గా అవతరించాడు. ఆయనతో సినిమా తీయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇదే క్రమంలో మూడవ సినిమా పెద్ద బ్యానర్ అయిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో పడింది.

Uday kiran : అలా ఉదయ కిరణ్ స్టార్ డం కొనసాగింది.

ఇదే బ్యానర్ లో రెండు సినిమాలు కమిటయ్యాడు. అందులో మూడవ సినిమాగా మనసంతా నువ్వే సినిమా వచ్చింది. చిత్రం కాంబినేషన్ మళ్ళీ రిపీటవడంతో భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత నీ స్నేహం వచ్చింది హిట్ గా నిలిచింది. దాంతో ఉదయ కిరణ్ సినిమా అంటే థియేటర్స్ భారీగా కేటాయించారు. ఆ సమయంలో శత చిత్రాల దర్శకుడు అనే పేరున్న స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో త్రినేత్రం వచ్చింది. అయితే ఆర్.టీ.సీ క్రాస్ రోడ్స్ లోని దేవీ థియేటర్ లో ఇది రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఉదయ కిరణ్ నటించిన మరోక సినిమా హోళి కూడా అదే సమయంలో ఉండటంతో ఆ థియేటర్ హోళికి కేటాయించారు. అలా ఉదయ కిరణ్ స్టార్ డం కొనసాగింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 28, 2021 at 9:37 ఉద.