Prabhudeva : ప్రతీ ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు సహజం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం చాలా తక్కువ మందికే ఉంటుంది. సామాన్యుల జీవితాలతో పోల్చుకుంటే రాజకీయ, సినీ తారల జీవితాలలో జరిగే సంఘటనలే సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తుంటాయి. అందుకు కారణం వాళ్ళు ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. సినీ తారలు ప్రేక్షకులను అలరించడానికి రక రకాల పాత్రల్లో నటిస్తుంటారు. వాటిలో కొన్ని మంచి పాత్రలు సమాజానికి మేలు చేస్తే కొన్ని పాత్రలు మాత్రం కీడు చేస్తుంటాయి. అయినా కమర్షియల్ అంశాలని జనాలకి చూపించని అంశాలను, సంఘటనలను చూపించి ప్రభావితులను చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు.

that was the big mistake committed by prabhudeva
that was the big mistake committed by prabhudeva

అయితే ఇలా సినిమాలలో కాకుండా సినిమాలో నటించిన ప్రభావంతో నిజ జీవితంలో కూడా తీసుకోకూడని నిర్ణయాలను తీసుకోవడం..చేయకూడని తప్పులు చేయడం..దాంతో వార్తల్లోకెక్కి అందరి దృష్టిలో అప్పటివరకు ఉన్న మంచి పేరును చెడగొట్టుకోవడం అలా జరిగిపోతాయి. వీటికి కొన్ని సందర్భాలలో కారణం అయ్యేది మబ్బుల్లో కమ్మేసే ప్రేమ. ఈ ప్రేమ మత్తులో పడితే చేసేదేంటో కూడా తెలీయకుండా అన్నీ అదుపు తప్పుతుంటాయి. అలా ప్రభుదేవ కెరీర్ లో కూడా జరిగిన ఒక మరపురాని సంఘటన స్టార్ హీరోయిన్ నయనతారతో ప్రేమలో పడటం. అప్పటి వరకు ప్రభుదేవా మీద అందరికీ ఎంతో మంచి అభిప్రాయం ఉండేది.

Prabhudeva : ప్రభుదేవా కెరీర్ లో ఈ సంఘటన మర్చిపోనిదిగా మిగిలింది.

ఎప్పుడైతే నయనతారతో పీకల్లోతూ ప్రేమలో మునిగాడో అప్పుడు ఆయనని విమర్శించేవాళ్ళు తయారయ్యారు. అందుకు కారణాలు కూడా బలంగానే ఉన్నాయి. మనం ఇష్టపడే మనకళ్ళ ముందే పొరపాటు చేస్తుంటే సహజంగానే బాధ కోసం వచ్చేస్తాయి. అదే ప్రభుదేవా విషయంలో జరిగింది. అప్పటిలే నయనతార శింబుతో ప్రేమలో మునిగితేలి విడిపోయింది. అది తెలిసి కూడా ఈ డాన్స్ మాస్టర్ నయన్ తో ఎలా లవ్ లో పడ్డాడో అని జుట్టు పీక్కున్నవాళ్ళు ఉన్నారు. అయితే వీరి ప్రేమ కూడా సజావుగా సాగలేదు. మధ్యలోనే వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఏదేమైనా ప్రభుదేవా కెరీర్ లో ఈ సంఘటన మర్చిపోనిదిగా మిగిలింది. ఇక ప్రభదేవా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 16, 2021 at 2:00 సా.