Durgam Chinnayya: పవర్ అబ్యూస్ చెయ్యడం రాజకీయ నాయకులకు చాల అలవాటు. ఈ రాజకీయ నాయకులు తమకున్న పవర్ ను అడ్డుపెట్టుకొని పరిశ్రమల అధినేతలనుభయపెడుతూ, బెదిరిస్తూ వాళ్లకు కావాల్సిన డబ్బును, అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఇప్పుడు ఒక మహిళా సీఈఓ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. తనకున్న అధికారాన్ని వాడుకుకొని తమను ఇష్టమొచ్చినట్టు ఇబ్బందులు పెట్టాడని ఆరిజన్ డైయిరీ సంస్థ సీఈఓ బోడపాటి శైలజ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈమె చిన్నయ్యపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆడియే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తన కంపెనీలోని షేర్స్ ను తన మనుషులకు ఎమ్మెల్యే ఇప్పించుకున్నాడని, తరువాత తమపైనే అక్రమంగా కేసులు పెట్టి, మూడు రోజుల పాటు తమను బంధించి, ఇబ్బందులకు గురి చేశాడని చెప్పిన, పోలీసులు కూడా ఎమ్మెల్యేకే మద్దతుగా ఉంటూ, తమను ఆ అనేక ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. అలాగే తన ఫ్రెండ్ ను ఒక నైట్ కు పంపాలని, ఎమ్మెల్యే చిన్నయ్య తనను ఆడినట్టు, తానూ వేరే బ్రోకర్ నెంబర్ ఇస్తే, వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే అమ్మాయిలను తెప్పించుకున్నారని శైలజ ఆ ఆడియోలో చెప్పారు. శైలజ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్అవుతుంది.
అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నా సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారి రహస్యాలు ఒక దాని తరువాత ఒకటి బయట పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చాల నష్టం చేస్తాయని రాజకీయా విశ్లేషకులు చెప్తున్నారు. పైగా ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించిన ఏ చిన్న విషయాన్నీ బీజేపీ వాళ్ళు వదిలిపెట్టడం లేదు. మొన్నటి వరకు కవిత లిక్కర్ స్కాం గురించి బీజేపీ రచ్చ చేసింది, తరువాత పేపర్ లీకేజ్ గురించి రచ్చ చేసింది. ఇప్పుడు ఈ దుర్గం చిన్నయ్య ఆడియోపై బీజేపీ ఎంత రాదంతం చేస్తుందో చూడాలి.