Today Gold Rates : మహిళలకు బంగారం లాంటి వార్త…! దిగొచ్చిన పసిడి ధర అదే బాటలో వెండి…

S R

Today Gold Rates Latest Gold & Silver Prices : బంగారం పేరు ఎత్తాలంటేనే మధ్య తరగతి వాళ్ళు భయపడిపోతున్నారు అంతలా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శుభకార్యాలకు బంగారం కొనాలంటే లక్షలు పోయాల్సిందే. అయితే బంగారం ఇప్పటి పరిస్థితులలో చాలా మందికి ఇన్వెస్ట్‌మెంట్ . అలాగే భవిష్యత్తు ఆర్ధిక అవసరాల కోసం ఉపయోగపడేది. ఇక ప్రస్తుతం ఒక తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైనే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇండియాలో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.4710గా ఉంది. నిన్న ఇదే ఒక గ్రాము బంగారం ఆ ధర రూ.4740గా ఉండేది. అంటే, ఒక గ్రాముకు రూ.30 తగ్గింది. 10 గ్రాములకు 22 క్యారెట్లకు రూ.47,100 కాగా, నిన్న రూ.47,400గా ఉండేది. అంటే.. 10 గ్రాములకు రూ.300 తగ్గింది.24 క్యారెట్లకు ఒక గ్రాముకు రూ.5138 కాగా.. నిన్న రూ.5170గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.32 తగ్గింది. 10 గ్రాములకు ఇవాళ రూ.51380 కాగా.. నిన్న రూ.51,700 గా ఉండేది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ రూ.320 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.47,100 కాగా 24 క్యారెట్లకు 51,380 గా ఉంది. విజయవాడలో కూడా బంగారం ధరలు ఈ విధంగానే తగ్గాయి. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో కూడా రూ.300 తగ్గడంతో ఈ ధర రూ.47,100గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గి రూ.51,380గా ఉంది. కేజీ సిల్వర్‌పై కూడా రూ.1,200 మేర ధర తగ్గిపోయింది. దీంతో ఈ ధర విజయవాడలో రూ.66,500గా ఉంది.

దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. అమెరికా డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ ర్యాలీ చేస్తుండటంతో గోల్డ్ ధరలు వరుసగా మూడో వారంలోనూ పడిపోయాయి. MCX ఫ్యూచర్స్ ‌లో ఈ ధరలు రూ.2,500 మేర పతనమయ్యాయి. పెరుగుదల పడిపోతుందనే భయాలు, అంచనాలను కఠినతరం చేసి అమెరికా డాలర్ పడిపోకుండా చర్యలు చేపట్టడం వంటివి గోల్డ్‌పై ఒత్తిడికి దారి తీస్తున్నాయి.

- Advertisement -