Tollywood Actress: ఈ ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టరా.. న్యాచురల్ బ్యూటీ!

Akashavani

Tollywood Actress: తెలుగు ప్రేక్షకులకు సాయి పల్లవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్లో ఫిదా చేసింది. ఆపై పలు స్టార్ హీరోల సరసన నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడి.

ఇక సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది. ఇటీవల వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టింది. ఇక ఈ భామ ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఫుల్ గా చిల్ అవుతుంది. ఇక సాయి పల్లవి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన అందాలను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో ఆరబోసి. తన ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. ఇక అదే క్రమంలో ఈ ఫిదా బ్యూటీ మరొక పోస్టు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకొని నెటిజన్ల ను మరో లెవెల్లో ఆకట్టుకుంటుంది. ఈ పోస్టులో సాయి పల్లవి పసుపు తోట లో కార్మికుల మధ్యలో తాను ఒక కార్మికుల రాలిగా ఫోటో దిగింది.

Tollywood Actress: సాయి పల్లవి ని అలా చూసిన నెటిజన్లు ఈ విధంగా కామెంట్ చేశారు.

ఆ ఫోటో ని చూసిన నెటిజన్లు సాయి పల్లవి ని గుర్తు పట్టలేకపోతున్నారు. కొన్ని నిమిషాలు పరీక్షిస్తే గాని ఆమె ఒక హీరోయిన్ అని తెలుసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన ఒక నెటిజన్ గోల్డ్ అని కామెంట్ చేయగా.. మరో నెటిజన్ మాత్రం యువర్ నాచురల్ మామ్ అంటూ పోగుడి పారేసాడు. ఇక మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ఆ ఫోటో పై ఒక లుక్కెయండి.

- Advertisement -