Rakshmika: జిమ్ ట్రైనర్ తో రష్మిక మందన్నా.. ఆ వర్కౌట్స్ చూస్తే చమటలు పట్టాల్సిందే!

Akashavani

Rakshmika: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా, ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా వరుస చిత్రాలలో నటిస్తూనే మరోవైపు ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ తన కెరియర్ లో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే వరుస సినిమా షూటింగులతో బిజీగా గడిపే రష్మిక తనకు వీలు దొరికినప్పుడల్లా జిమ్ లో భారీ వర్కౌట్లు చేస్తూ తన వర్కౌట్ లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఈ విధంగా రష్మిక చెమటలు కక్కుతూ చేసే ఈవర్కౌట్ లకు సంబంధించిన వీడియో క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక తన జిమ్ ట్రైనర్ తో కలిసి చేస్తున్నటువంటి ఒక వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rakshmika: రచ్చ చేస్తున్న రష్మిక…

రష్మిక తన జిమ్ ట్రైనర్ తో కలిసి చేస్తున్నటువంటి ఈ వర్కౌట్స్ ఎంతో హాట్ గా ఉన్నాయి. ఈ వీడియో కనుక చూస్తే కుర్రకారు కూడా చెమటలు పట్టాల్సిందే. అంతగా రష్మిక వర్కౌట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే రష్మిక సినిమాల విషయానికి వస్తే ఈమె విజయ్ దళపతితో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే పుష్ప 2 చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇదే కాకుండా మరో మూడు బాలీవుడ్ సినిమాలతో రష్మిక ఎంతో బిజీగా ఉన్నారు.

- Advertisement -