Kamal Haasan: భారతీయ సీనియర్ సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన అటు సినీ రంగం ఇటు రాజకీయ రంగంలో రెండు వైపులా సరిసమాన బాధ్యతలను మోస్తున్నాడు. ఈయనకు సినీ నటుడు గానే కాకుండా రాజకీయపరంగా ఎంతగానో అభిమానం ఉంది. ఈయన ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
ఇప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు కమల్ హాసన్. ఇక ఈయన ప్రస్తుతం విక్రమ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 3వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ భాగంలో బాగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కొన్ని విషయాలు పంచుకున్నాడు. సినిమాలు యూనివర్సల్ భాష మాట్లాడతాయి అని.. మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని అన్నాడు.
ఒక దేశంగా ఉన్న మనం ఒకే భాషను మాత్రం మాట్లాడటం లేదు అని.. అయితే జాతీయ గీతాన్ని మాత్రం ఒకటిగా గర్వంగా పడుతున్నాము అని అన్నాడు. ఆ రకంగా ప్రజలను ఏకం చేసే వాటిలో సినిమాలు ఉంటాయి అని.. నీ పక్కన కూర్చున్న వ్యక్తి కులాన్ని, ప్రాంతాన్ని అడగని ఒక ప్రదేశం సినిమా హాలు అని అన్నాడు. ఇక మనం ఈ స్థాయికి చేరడానికి దశాబ్దాలు పట్టాయి అని.. ఒకరినొకరు గౌరవించుకోవాలి అంటూ.. సినిమాలకు ఒకే భాష ఉండకపోవచ్చు కానీ సినిమాలు అన్నీ ఒకటే అని అన్నాడు.
Kamal Haasan: కులం, మతం గురించి అడగని ప్రదేశం ఇదే..
ఇక తనకు ఇతర నటీనటులతో నటించడం చాలా ఇష్టమని.. అయితే తను కలిసి పని చేయాలని కోరుకొని.. పని చేయలేని నటుడు ఒకరు ఉన్నారు అని.. అతడే దిలీప్ కుమార్ అని అన్నాడు. ఆయన గురించి కొన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. అంతే కాకుండా తాను నటించిన సినిమా గురించి కూడా కొన్ని విషయాలు బయట పెట్టాడు.