Tollywood Highest Remuneration టాలీవుడ్లో ఇపుడు లీడింగ్లోఉన్న ఉన్న హీరోయిన్లు సాదాసీదాగా కెరీర్ ప్రారంభించిన వాళ్లే. చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి..ఇపుడు స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ..సక్సెస్ ఫుల్‌గా కెరీర్ సాగిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో తమ హవా చాటుతూ ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ జాబితాలో పూజాహెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక మందన్నా, సాయిపల్లవి, సమంత, నయనతార అనుష్క, కీర్తిసురేశ్, శృతిహాసన్ , త్రిష ఉంటారు. వీరి రెమ్యునరేషన్లపై ఓ లుక్కేస్తే.. వీరిలో పాన్ ఇండియా సినిమాలతో టాప్ లో ఉన్నారు పూజాహెగ్డే, రష్మిక మందన్నా, సమంత, రకుల్, అనుష్క..ఈ టాప్ 10 హీరోయిన్లలో ఎవరెవరి రెమ్యునరేషన్లు ఎలా ఉన్నాయో చూద్దాం
Pooja Hegde పూజాహెగ్డే

వరుణ్ తేజ్‌తో ముకుందా సినిమాలో క్యూట్ క్యూట్ లుక్‌తో అందరికీ పరిచయమైంది పూజాహెగ్డే. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ అగ్రదర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఈ భామ ప్రస్తుతం ఏ సినిమాకైనా మినిమం 2.75 కోట్లు తీసుకుంటూ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా నిలిచింది.
Rashmika Mandanna రష్మికమందన్నా

ఛలో, గీతగోవిందం చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైంది కన్నడ సోయగం రష్మిక. ఈ సినిమాలు బాక్సాపీస్ వద్ద సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ రూ.2 కోట్ల వరకు తీసుకుంటుందట..
Rakul Preet Singh రకుల్ ప్రతీ సింగ్

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది రకుల్. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. బాలీవుడ్ లో కూడా బిజీగా అయిన ఈ భామ ప్రస్తుతం తక్కువలో తక్కువ రూ.కోటికి తగ్గకుండా పారితోషికం తీసుకుంటోంది.
Nayanthara నయనతార

లేడీ సూపర్ స్టార్ గా ఫేం దక్కించుకున్న ఈ భామ ప్రస్తుతం 2.5 నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటోంది.
Anushka అనుష్క

సూపర్ సినిమాతో తెరపై మెరిసింది. కట్ చేస్తే బాహుబలిలో దేవసేన్ లాంటి లీడ్ రోల్ చేసే స్థాయికి చేరుకుంది. ఈ బ్యూటీ సినిమా చేస్తే మినిమం రూ.2 కోట్లు తీసుకుంటుందట.
సమంత :
Keerthy Suresh కీర్తిసురేశ్

మహానటి సినిమాతో ఫేం సంపాదించిన ఈ భామ సినిమాకు రూ.1.5 కోట్లు తీసుకుంటుందని టాక్.
Trisha త్రిష

తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు అగ్రహీరోలందరితో కలిసి నటించిన త్రిషకు ఇప్పుడు సినిమాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సినిమాకు రూ. కోటి ఆఫర్ చేస్తుందట.
Sai Pallavi సాయిపల్లవి

ఫిదా సినిమాతోఅందరినీ ఫిదా చేసిన ఈ బెంగళూరు భామ ఇపుడు రూ.2 కోట్లకు తగ్గకుండా రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తుందని టాక్.
Samantha సమంత

ఏ మాయచేశావే సినిమాతో అందరినీ మాయ చేసిన ఈ చెన్నై సుందరి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ కూడా రూ.2 కోట్లు డిమాండ్ చేస్తుందట.
Shruti Haasan శృతిహాసన్

కమల్ హాసన్ గారాలపట్టిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది శృతిహాసన్. ఈ భామ సినిమాకు కనీసం రూ.కోటి తీసుకుంటుంది.