Uday Kiran: ఈటీవీ మల్లెమాల నిర్మాణ సంస్థ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మల్లెమాల నుండి ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు, కామెడీ షోలు ప్రసారం అవుతున్నాయి. ఇందులో వచ్చే షోలు అన్ని కొన్ని కొన్ని సార్లు మితిమీరి ఉండగా మరి కొన్ని ఎమోషనల్ టచ్ బాగా ఫీల్ లోకి తీసుకెళ్తాయి. అలా తాజాగా హలో బ్రదర్ అనే ఈవెంట్ ఎమోషనల్ టచ్ లోకి తీసుకొని వెళ్ళింది.
శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న ఈ షోలో బుల్లితెర సెలబ్రెటీలు పాల్గొని బాగా సందడి చేశారు. అందులో మరో బుల్లితెర నటుడు ఉదయ్ కిరణ్ తన చివరి క్షణాల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను
స్కిట్ ద్వారా చూయించాడు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా యువత మనసులు దోచుకున్న హీరో ఉదయ్ కిరణ్.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎక్కువగా ప్రేమ కథ సినిమాలలో నటించాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టి తన సొంత టాలెంట్ తో మంచి హీరోగా ఎదిగాడు. ఎన్నో సినిమాలలో నటించాడు.
తొలిసారిగా చిత్రం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమాతో తన తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకని మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో నటించాడు. తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.
Uday Kiran: ఉదయ్ కిరణ్ ని మరోసారి గుర్తుకు చేసిన ఆ నటుడు..
ఇక ఆ తర్వాత కొంతకాలానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అవకాశాలను అంతగా అందుకోలేకపోయాడు. ఆ ఇబ్బందులు ఎదుర్కొనే ధైర్యం లేక వాటిని తట్టుకోలేక ఉదయ్ కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన చనిపోయాక సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఇక ఆయన ఎదుర్కున్న ఇబ్బందులను ఆ బుల్లితెర నటుడు చూయించటంతో.. అక్కడున్న వారితోపాటు ఈ వీడియో చూసిన ప్రేక్షకులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు