Undavalli Sridevi: ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ చేసిందన్న కారణంతో చేత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. నిన్నటి వరకు మీడియాకు దూరంగా ఉన్న శ్రీదేవి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి వైసీపీపైన, సీఎం జగన్మోహన్ రెడ్డిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రాస్ వోటింగ్ చేశానని ఎలా డిసైడ్ చేశారని, తానూ కరెక్ట్ గానే ఓటు వేశానని, ఇంకా పార్టీలో చాలామంది అసంతృప్తితో ఉన్నారని, జనసేన ఎమ్మెల్యే కూడా వేసి ఉండవచ్చని శ్రీదేవి మీడియా ముందు చెప్పారు. అయితే పార్టీలో మొదటి నుండే తనను వేధిస్తున్నారని, దళిత్ ఎమ్మెల్యేననే వైసీపీ నాయకులు తనను చిన్న చూపు చూస్తున్నారని, రాష్ట్రంలో దళితులను చంపేస్తున్నా కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో డెవలప్ ఎక్కడ!!
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్దన్నది ఆగిపోయిందని, ఎక్కడ చూసినా అవినీతే ఉన్నదని శ్రీదేవి అన్నారు. అమరావతిలో జరిగిన అభివృద్ధి కనీసం 10% ఐన రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో పెద్ద స్కాం జరిగిందని, అందులో చాలా డబ్బులు వైసీపీలో పెద్దలు నొక్కేశారని, ఇసుక మాఫియాను కూడా వైసీపీ నాయకులే దగ్గరుండి నడిపిస్తున్నారని, వారికి తానూ అడ్డుగా వస్తుండటం వల్లే తనను పార్టీ నుండి తప్పిస్తున్నారని, తనకు ఇప్పటికీ జగన్ పై నమ్మకం ఉందని, కానీ అతను పక్కవాళ్ళు చెప్పిన మాటలు నమ్మి తనను సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చారు.
వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా
ఇప్పటి నుండి తానూ స్వాతంత్య్ర ఎమ్మెల్యేనని, ఇప్పటి నుండి అమరావతి రైతుల పక్షాన పోరాడటమే తన లక్ష్యమని, ఎప్పటి నుండో రైతుల పక్షాన నిలవాలని ఉన్నా కూడా వైసీపీ పెద్దల వల్లే అమరావతికి దూరంగా ఉన్నానని, ఇక మీదట నుండి ఎప్పుడూ అమరావతి కోసమే తన పోరాటమని చెప్పారు. అయితే ఆమె టీడీపీలో చేరుతున్నట్టు కూడా ఎక్కడా చెప్పలేదు కాని సోషల్ మీడియాలో మాత్రం టీపీడీలోకి వెళ్తారన్న వార్తలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. అయితే తనకు పార్టీలో నుండి సస్పెండ్ చేసిన వైసీపీకి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శ్రీదేవి చెప్పారు.