Union Budget 2023-24 : కేంద్ర బడ్జెట్ 2023 – 24 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. అయితే.. ఈసారి ఇన్ కం టాక్స్ స్లాబ్ లలో మార్పులు ఉన్నట్టు ఆమె ప్రకటించారు. స్లాబ్ ను రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. వేతన జీవులకు ఊరట కల్పించారు. రూ.7 లక్షల వరకు ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అంటే.. ఆదాయం రూ.7 లక్షలు దాటితేనే ఐదు స్లాబుల్లో పన్ను రేటు ఉంటుంది. రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను కట్టాలి. ఈసారి బడ్జెట్ ను రూ.39.44 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. రూ.16.60 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవే.
* రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు
* ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
* టీవీ ప్యానెళ్ల ధరలు తగ్గింపు
* 2013 – 14 తో పోలిస్తే రైల్వేలకు 9 రెట్ల నిధులు విడుదల
* కర్ణాటక సాగు రంగానికి రూ.5300 కోట్ల సాయం
* దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్ పోర్టులు, హెలిప్యాడ్ ల నిర్మాణం
* 5జీ సేవల అభివృద్ధి కోసం 100 ప్రత్యేక ల్యాబ్ ల ఏర్పాటు
* విద్యుత్ రంగానికి రూ.35 వేల కోట్ల కేటాయింపు
* నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్ కు రూ.19700 కోట్ల కేటాయింపు
* వృద్ధి రేటు 7 శాతంగా అంచనా
* మూలధన వ్యయాలు మొత్తం రూ.10 లక్షల కోట్లు
* కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు
* పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు
* పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా రూ.10 వేల కోట్లు
* గిరిజనుల కోసం పీఎం పీవీటీజీ మిషన్ ఏర్పాటు
* ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం
* మత్స్య రంగానికి రూ.6 వేల కోట్లు
* 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు
* రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు
* తగ్గనున్న వజ్రాల ధరలు
* బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు
* పెరగనున్న టైర్లు, సిగరెట్ల ధరలు
* పెరగనున్న బ్రాండెడ్ దుస్తుల ధరలు
* పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
* భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు
* తగ్గనున్న టీవీలు, మొబైల్ ధరలు, కిచెన్ చిమ్నీ ధరలు