Upasana: మెగా కుటుంబంలోకి ఇటీవల వారసురాలు అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో మెగా అభిమానులు అందరూ కూడా పాపని ముద్దుగా మెగా ప్రిన్సెస్ అని పిలుచుకుంటున్నారు. అయితే ఉపాసన మాత్రం తమ కూతురికి ఎటువంటి ట్యాగ్స్ ఇవ్వకండి అంటూ అభిమానులను వేడుకుంటుంది. రామ్ చరణ్ ఉపాసన వివాహం జరిగిన 11 సంవత్సరాలకు క్లింకార జన్మించింది. దీంతో 11 సంవత్సరాలుగా మెగా కుటుంబానికి వారసుల కోసం ఎదురుచూసిన మెగా అభిమానులు క్లింకార జన్మించటంతో సంబరాలు జరుపుకున్నారు. ఇక రామ్ చరణ్,ఉపాసన తమ కూతురికి క్లింకార అని నామకరణం చేశారు.
క్లింకార నామకరణం వేడుక ఎంతో ప్రత్యేకంగా,ఘనంగా జరిగింది. ఈ నామకరణ వేడుకకు సంబంధించిన కొన్ని విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నామకరణ వేడుకను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు జాతి సంస్కృతిలో ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా తాజాగా జులై 20 ఉపాసన పుట్టినరోజు కావడం, అలాగే క్లీంకార పుట్టి కూడా కరెక్ట్ గా నెల (జూన్ 20న జన్మించింది) అవ్వడంతో.. రామ్ చరణ్ ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Upasana: ట్యాగ్స్ వారే సంపాదించుకోవాలి..
ఇదిలా ఉండగా క్లింకార కి మెగా అభిమానులు ముద్దుగా మెగా ప్రిన్సెస్ అని ట్యాగ్ ఇచ్చారు. దీని పై ఉపాసన ఈ వీడియోలో స్పదించారు. ”క్లీంకార పేరుకి ముందు వెనుక ఎటువంటి ట్యాగ్స్ పెట్టకండి. అలాంటి ట్యాగ్స్ ని వారే కష్టపడి స్వయంగా సంపాదించుకోవాలి అనేది నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇది చాలా ముఖ్యమైంది”అంటూ ఉపాసన మెగా అభిమానులకు విజ్ఞప్తి చేసింది. అంతే కాకుండా ఈ వీడియోలో రామ్ చరణ్ పెళ్లి నాటి మధుర జ్ఞాపకాలతో పాటు క్లింకార జన్మ సమయంలో హాస్పిటల్ లో చిత్రీకరించిన కొన్ని అద్భుతమైన దృశ్యాలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.