uttar pradesh bride slaps bride groom after wedding news viral
uttar pradesh bride slaps bride groom after wedding news viral

Viral News : ఈ మధ్య వివాహాలు జరిగే సమయంలో ఎన్నో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ఘటనలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి సమయంలో ఏవైనా చిలిపి ఘటనలు జరగడం, ఆ చిలిపి ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవడం.. వాటిని సోషల్ మీడియాలో చూసి నెటిజన్లు వాటిని వైరల్ చేయడం.. అన్నీ ఫటాఫట్ జరిగిపోతున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది.

uttar pradesh bride slaps bride groom after wedding news viral
uttar pradesh bride slaps bride groom after wedding news viral

ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ లో ఓ ఘటన చోటు చేసుకుంది. అక్కడ పెళ్లి జరిగింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అందరూ సంతోషంగా ఉన్నారు. పెళ్లి తర్వాత భోజనాలు అయిపోగానే.. భరత్ కూడా అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.. ఇద్దరూ కలిసి కారు ఎక్కి పెళ్లి కొడుకు ఇంటికి వచ్చారు. కారు దిగారు. ఆ తర్వాత జరిగిన విషయంలో పెళ్లి పెటాకులు అయిపోయింది. పెళ్లయి కాళ్లకు పారాణి కూడా ఆరక ముందే వాళ్ల పెళ్లి పెటాకులు అయిపోయింది.

Viral News : కారు దిగగానే పెళ్లి కూతురు చేసిన పనికి అందరూ షాక్

పెళ్లి కారు దిగగానే.. పెళ్లి కొడుకు ఇంట్లో కోడలు అడుగు పెట్టకముందే.. పెళ్లి కొడుకును పట్టుకొని చెంప చెళ్లుమనిపించింది పెళ్లి కూతురు. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. పెళ్లి కొడుకుతో సహా. అసలు ఏం జరిగింది అని అందరూ విచిత్రంగా చూశారు. ఆ తర్వాతే తెలిసింది.. తన పెళ్లికి ముందే పెళ్లి కొడుకు వేరు అమ్మాయిని ప్రేమించాడని. ఆ విషయం పెళ్లి కూతురుకు తెలిసిందట. అందుకే.. వెంటనే పెళ్లి కొడుకు చెంపను వాయించేసింది. చివరకు.. రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లడం.. ఆ తర్వాత ఇద్దరూ విడిపోవడం.. అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 24, 2021 at 2:13 సా.