Varudu : స్టార్ డైరెక్టర్ – స్టార్ హీరో అనగానే అంతక ముందు వారి సినిమాల సూపర్ హిట్స్ చూసి అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాలలో భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అని మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీలలో కూడా కొన్ని క్రేజీ కాంబినేషన్స్ మీద అంచనాలు బాగా ఏర్పడతాయి. అలా ఏర్పడిన కాంబినేషన్ గుణశేఖర్ – అల్లు అర్జున్‌లది. వీరిద్దరు కలిసి వరుడు అనే సినిమా చేశారు. గుణశేఖర్ తీసిన సినిమాలో ఓ భారీ హిట్ పడితే ఆ తర్వాత ఓ రెండు ఫ్లాపులు పడుతుంటాయి. లాఠీ అనే సినిమాతో గుణశేఖర్ దర్శకుడిగా మారాడు.

varudu movie is flop because of director and heroine...
varudu movie is flop because of director and heroine…

ఈ సినిమా తర్వాత సొగసు చూడతరమా, రామాయణం, చూడాలని ఉంది, మనోహరం, మృగరాజు, ఒక్కడు, అర్జున్, సైనికుడు లాంటి సినిమాలు తీశాడు. వీటిలో భారీ హిట్ అంటే చూడాలని ఉంది..ఒక్కడు. హిట్ అంటే అర్జున్ సినిమా. ఆ తర్వాత వచ్చిన సైనికుడు పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. సైనికుడు లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కూడా అల్లు అర్జున్..గుణశేఖర్‌తో సినిమా చేయడానికి కమిటయ్యాడు. ఇది పెద్ద సాహసం. సైనికుడు ఫ్లాప్ కాబట్టి ఖచ్చితంగా వరుడు బ్లాక్ బస్టర్ అవుతుందని అందరు భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేసి పెద్ద ఫ్లాప్ మూవీగా వరుడు మిగిలింది.

Varudu : దర్శకుడు చేసిన పెద్ద పొరపాటే సినిమా ఫ్లాప్‌కి కారణం అయింది.

అయితే హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న వరుడు ఇంత భారీ డిజ్సాస్టర్ అవడానికి కారణం ఏంటని అభిమానులు, విశ్లేషకులు చర్చించుకున్నారు. ఇందులో జరిగిన పెద్ద పొరపాటు రెండు. ఒకటి హీరోయిన్‌ని ఫస్టాఫ్ మొత్తం హైడ్ చేయడం. ఇది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక హీరోయిన్ కూడా ఆ పాత్రకి మైనస్ గా మారింది. మరీ ముఖ్యంగా డైరెక్టర్ గుణశేఖర్ కథ, కథనం అభిమానులను, ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కథ విషయంలో దర్శకుడు చేసిన పెద్ద పొరపాటే సినిమా ఫ్లాప్‌కి కారణం అయింది. ఇక తమిళ నటుడు ఆర్య నటించిన పాత్ర కూడా మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ కాలేదు. ఈ మైనస్‌లు వల్ల భారీ అంచనాల మధ్య వచ్చిన వరుడు సినిమా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 6, 2021 at 4:05 సా.