Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన నటి లావణ్య త్రిపాటిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది అయితే ఆగస్టులో వీరి వివాహం జరగబోతోంది అంటూ పెద్ద ఎత్తున మీరు పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.తాజాగా వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన తన పెళ్లి గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ తన పెళ్లి ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో జరగబోతుందని తెలిపారు. అయితే ఇంకా తమ పెళ్లి తేది ఫిక్స్ కాలేదని తెలిపారు..త్వరలోనే పెళ్లి తేదీ నిర్ణయించబోతున్నామని అయితే తమ పెళ్లి తేది ఫిక్స్ చేసే బాధ్యత మొత్తం తన తల్లి చూసుకుంటుందని వరుణ్ తేజ్ వెల్లడించారు అదేవిధంగా తన పెళ్లి గ్రాండ్గా కాకుండా చాలా ప్రైవేట్ గాచేసుకోవాలని అనుకుంటున్నాను అందుకే తాను హైదరాబాదులో ఇలా చేసుకోవడానికి కుదరకపోవడంతో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసామని తెలిపారు.
Varun Tej:
ఇప్పటికే తమ పెళ్లి ఎక్కడ అనే విషయం గురించి ఇండియాలో మూడు ప్లేస్లను సెలెక్ట్ చేశామని అలాగే విదేశాలలో రెండు ప్లేసులను సెలెక్ట్ చేశామని వరుణ్ తేజ్ తెలిపారు. అయితే ముందు పెళ్లి తేది ఫిక్స్ అయిన తర్వాతనే పెళ్లి ఎక్కడ జరగబోతుంది అనే విషయాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన పెళ్లి గురించి తెలియజేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన గత ఐదు సంవత్సరాలుగా లావణ్య త్రిపాఠి తో ప్రేమలో ఉన్నారని ముందుగా తానే లావణ్యకు ప్రపోజ్ చేశారని కూడా వెల్లడించారు.