Vijay devarakonda : ఎవడే సుబ్రమణ్యం సినిమాలో చిన్న పాత్ర ద్వార టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో చేసిన పాత్రకి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు ఇతను పెద్ద స్టార్ అవుతాడని చాలామంది అప్పుడే చెప్పారు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా నిర్మాతలకి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అంతేకాదు డీసెంట్ మూవీగా చిత్ర బృందం అందరికి మెమరబుల్ హిట్ ఇచ్చింది. భారీ సెట్టింగ్స్, ఫారిన్ లో సాంగ్స్, హై ఓల్టేజ్ ఫైట్స్ లాంటివి లేకుండా హిట్ కొట్టారు.

vijay-devarakonda-could not give hit to a star director
vijay-devarakonda-could not give hit to a star director

దీనితో టాలీవుడ్‌లో బాగానే పేరు తెచ్చుకున్నాడు విజయ్. ఆ తర్వాత ద్వారక సినిమాతో వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి విజయ్ కి హిట్ మాత్రం దక్కలేదు. కానీ అదే ఏడాది వచ్చిన అర్జున్ రెడ్డి సెన్షేషనల్ హిట్ అందుకొని ఆయన రేంజ్ నే మార్చేసింది. ఓవర్ నైట్ పాన్ ఇండియన్ స్టార్ రేంజ్ లో విజయ్ దేవరకొండకి క్రేజ్ వచ్చింది. అర్జున్ రెడ్డితో రౌడీ హీరో అనే ట్యాగ్ కూడా అభిమానులు తగిలించారు. ఈ సినిమా చూసి బాలీవుడ్ హీరోయిన్స్ కూడా విజయ్ కి ఫ్యాన్స్ అయ్యారు. ఇంత క్రేజ్ రావడంతో సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ యంగ్ హీరోకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Vijay devarakonda : వరల్డ్ ఫేమస్ లవర్ ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ లాస్ గా మిగిలింది.

దీని తర్వాత వచ్చిన గీత గీవిందం 100 కోట్ల క్లబ్ లో చేరి మరో భారీ హిట్ తన అకౌంట్ లో చేరింది. ఇలా విజయ్ తో చేసిన నిర్మాతలు బాగా సంపాదించుకున్నారు. కానీ డియర్ కామ్రేడ్,వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తీవ్రంగా నిరాశపరచాయి. అంతేకాదు ఈ రెండు సినిమాలు నిర్మాతలను బాగా నష్టాల్లో పడేశాయి. ముఖ్యంగా సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు
నిర్మాణంలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ లాస్ గా మిగిలింది. విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ తో ఎంతో నమ్మకంగా ఆయనతో సినిమా చేసిన నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టలేకపోయాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకుడు.

 

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 15, 2021 at 10:08 ఉద.