Viral Video: ప్రస్తుత కాలంలో పెళ్లి చేయాలంటే వధూవరులు ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎంతో ఫ్యాషన్ గా ఉండాలని ఆశపడుతుంటారు. డ్రస్సుల విషయం నుంచి మేకప్ వరకు ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇకపోతే పెళ్లికి వచ్చిన అతిథులందరికీ దృష్టి వారిపైనే ఉండేలా కేవలం వారి విషయంలోనే కాకుండా మండపం విషయం నుంచి పెళ్లిలో వివిధ రకాల భోజనాలు వరకు ప్రతి ఒక్కటి ఎంతో ప్రత్యేకంగా ఉండేలా చూస్తారు. ఇకపోతే పెళ్లిలో ఎంతో ముఖ్యంగా ఉండవలసిన పూలదండలు విషయంలో కూడా వధూవరుల ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు.
ముఖ్యంగా వధూవరుల దుస్తులకు సరిపోయే విధంగా కరెక్ట్ కలర్ మ్యాచింగ్ తో ఈ మధ్యకాలంలో పెళ్లి దండలను డిజైన్ చేయించుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవడం ప్రస్తుత కాలంలో ట్రెండ్ అవుతుంది. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో వధూవరులిద్దరూ పెళ్ళిలో పూలదండలకు బదులుగా పామును మెడలో వేసుకుని పెళ్లి చేసుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా భయంకరంగా ఉన్న ఇది నిజం.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: పామునే పూల మాలగా…
ఈ వీడియోలో భాగంగా వరుడు వధువు మెడలో పెద్ద తాచుపామును దండగ వేసారు. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోపై ఎంతోమంది పలు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ ఆ పాము కొరికినా బహుశా వీళ్ళు ఎవరికీ చెప్పరేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. పామును చూస్తే ఎవరైనా భయంతో ఆమడ దూరం పరిగెడతారు వీల్లేవర్రా బాబు ఇలా పాములు మెడలో వేసుకుని పెళ్లి చేసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేయండి.