viral video of fruit vendor cheating
viral video of fruit vendor cheating

Viral Video : సాధారణంగా కిరణా కొట్లో, లేదా కూరగయాల షాప్ లోనో.. లేదా ఇంకెక్కడో అయినా తూకంలో కొంచెం అటూ ఇటూ చేస్తుంటారు. అయితే.. అందరూ అలా చేయరు కానీ.. కొందరు మాత్రం వినియోగదారులను మోసం చేస్తుంటారు. చాలాసార్లు చాలామంది వినియోగదారులు మోసపోయి ఉంటారు. తూకం కాడ కాస్త ఆటూ ఇటూ అవుతుంది. దాన్ని వినియోగదారులు పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఈ పండ్ల వ్యాపారి చూడండి. ఎలా వినియోగదారులను మోసం చేస్తున్నాడో. అందుకే ఏదైనా కొనేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఆదమరిచినా కూడా అంతే సంగతులు.

viral video of fruit vendor cheating
viral video of fruit vendor cheating

ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతలా అంటే.. సోషల్ మీడియాలో ఈ వీడియో గురించే రచ్చ. మరీ ఇంత దారుణంగా వినియోగదారులను మోసం చేస్తారా? అంటూ నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు. డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా ఇంతలా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video : ఎలా మోసం చేస్తున్నాడంటే?

ఓ కస్టమర్.. పండ్ల వ్యాపారి వద్దకు వెళ్లాడు. మామిడి పండ్లు కావాలని అడిగాడు. తనకు నచ్చిన మామిడి పండ్లను ఏరుకొని పండ్ల వ్యాపారికి ఇచ్చాడు. అయితే.. తను మొదటగా తనకు నచ్చిన రెండు మామిడి పండ్లను ఇచ్చి.. వాటిని కవర్ లో వేయమంటూ వ్యాపారికి ఇవ్వగా.. వ్యాపారి వెంటనే తెలివిగా.. ఆ పండ్లను తీసేసి.. చెడిపోయిన పండ్లను కవర్ వేశాడు. రెప్పపాటులో ఆ కస్టమర్ తనకు నచ్చిన పండ్లను ఏరుకుంటుండగానే అలా చేశాడు. మరోసారి కూడా అలాగే చేశాడు. మొత్తం మీద ఆ కస్టమర్ తనకు నచ్చిన మామిడి పండ్లు ఇస్తే.. వ్యాపారి మాత్రం వాటిని పక్కన పెట్టి.. వేరే పండ్లను కవర్ లో వేసి జోకి ఇచ్చాడు. ఇదంతా కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. వామ్మో.. ఇటువంటి మోసగాళ్లు కూడా ఉంటారా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 22, 2021 at 5:56 సా.