Virataparvam : ‘విరాటపర్వం’.. రానా – సాయి పల్లవి జంటగా ప్రియమణి ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం. ఈ సినిమా షూటింగ్ 5రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉందని ఇటీవల నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు. కాగా ఇటీవల సోషల్ మీడియాలో ‘విరాట పర్వం’ సినిమా షూటింగ్ త్వరలోనే కంప్లీట్ చేసి ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల నారప్ప సినిమా గురించి సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ నిర్మాణ భాగస్వామ్యంలో నిర్మిస్తున్న సినిమాలకి సంబంధించిన రిలీజ్ విషయంలో మేము నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పారు.

virataparvam-will-be-in-theater-only
virataparvam-will-be-in-theater-only

కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇండస్ట్రీ వర్గాల్లో విరాటపర్వం ఓటీటీ ద్వారా విడుదల కానున్నదని ఈ మధ్య ప్రచారం మొదలయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై దర్శకుడు వేణు ఉడుగుల స్వయంగా స్పందించాడు. వేణు ఉడుగుల ఇంతకముందే తమ సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తామని తెలిపారు. అయితే తాజాగా మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వేణు ఉడుగుల మరోసారు స్పందించాల్సి వచ్చింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం లేదంటూ..ఖచ్చితంగా విరాట పర్వం సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయబోతున్నట్లు తేల్చేశారు.

Virataparvam : విరాట పర్వం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.

విరాట పర్వం సినిమా షూటింగ్ పూర్తవకుండానే ఓ ప్రముఖ ఓటీటీ వారు భారీ ఆఫర్ ఇచ్చింది. కానీ నిర్మాత ఆ ఆఫర్ కి ఎలాంటి హామీ ఇవ్వలేదట. అంతేకాదు హీరో రానా కూడా విరాట పర్వం ఓటీటీ విడుదల విషయంలో నో చెప్పకపోవడంతో త్వరలోనే ఓటీటీ రిలీజ్ అవ్వడం ఖాయమని అందరు ఫిక్సైయ్యారు. కానీ వేణు ఉడుగుల ఇచ్చిన తాజా ప్రకటనతో థియేటర్స్ లోనే రిలీజ్ అని చెప్పారు. ఇక ఈ సినిమా భారీ హిట్ సాధిస్తుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. చూడాలి మరి విరాట పర్వం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 21, 2021 at 10:00 సా.