Mahesh babu : టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఇప్పుడు మహేష్ బాబు కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్ లో ఉంది. అందుకు కారణం మహేష్ కమర్షియల్ యాడ్స్ పరంగా ఇంటర్‌నేషనల్ లెవల్‌లో చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోలతో కలిసి కూడా మహేష్ యాడ్స్ చేస్తున్నారు. ఈరోజు ఇంత క్రేజ్ ఉన్న మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి సినిమాలు చేసి అందరి మన్నలను పొందాడు. అన్నతోను మహేష్ నటించాడు. ఈ రకంగా ఫ్యామిలీతో మహేష్ కి ఉన్న బాండింగ్ చాలా గొప్పగా ఉంటుంది. మహేష్ ని అందరు ఇంట్లో నాని అని పిలుస్తారు.

what is the reason behind mahesh-babu marriage...?
what is the reason behind mahesh-babu marriage…?

అక్క మంజుల దగ్గర, తల్లి ఇందిర దగ్గర చాలా గారాబంగా ఉంటాడు. రాజకుమారుడు సినిమాతో సినిమాలలోకి హీరోగా ఎంటరయ్యాడు. మొదటి సినిమాతో ప్రిన్స్ మహేష్ బాబుగా క్రేజ్ తెచ్చుకొని స్టార్ గా వెలుగుతున్నాడు. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని సూపర్ స్టార్ అనే క్రేజ్ సాధించాడు. తండ్రి కృష్ణ మాదిరిగానే మహేష్ చాలా కూల్ గా ఉంటాడు. ఆయన ఎంత పాపులారిటీ సాధించినా ఈరోజుకి చాలా సింపుల్ గా ఉంటారంటే చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. అదే సింప్లిసిటీ మహేష్ కి వచ్చింది. షూటింగ్ ప్యాకప్ చెప్పాక కంప్లీట్ గా ఫ్యామిలీ మ్యాన్ అయిపోతాడు మహేష్. ఇది కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చిన గొప్ప లక్షణం.

Mahesh babu : కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వీరి పెళ్ళి జరిగింది.

ఇక మహేష్ బాబు పెళ్ళి చేసుకున్న సమయంలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అప్పటికే ప్రిన్స్ గా మంచి క్రేజ్ ఉన్న మహేష్ పెళ్ళి ఎంతో వైభవంగా జరుగుతుందని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అసలు మహేష్ చేసుకునే అమ్మాయి ఎవరు అనే ఆసక్తికరమైన చర్చలు సాగాయి. కానీ మహేష్ బాబు తన సహ నటి నమ్రత శిరోడ్కర్ ని పెళ్ళి చేసుకుంటాడని ఎవరు ఊహించలేదు. వీరిద్దరు కలిసి వంశీ అనే సినిమా చేశారు. ఈ సినిమా 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డ మహేష్ – నమ్రత 2005లో చెన్నైలో పెళ్ళి చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వీరి పెళ్ళి జరిగింది. అప్పట్లో వీరి పెళ్ళికి కృష్ణ ఒప్పుకోలేదన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది గాలి వార్తే అని మళ్ళీ రాసుకొచ్చారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 3, 2021 at 10:00 ఉద.