Whatsapp: మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల వాట్సాప్ గ్రూపుల కోసం రెండు కొత్త అప్‌డేట్‌లను ప్రకటించారు. కొత్త అప్‌డేట్‌లతో, అడ్మిన్‌లు తమ గ్రూప్ గోప్యతపై మరింత నియంత్రణను పొందుతారు. ఈ మార్పులు గత కొన్ని నెలలుగా చేసిన కొన్ని అప్‌డేట్‌లను అనుసరిస్తాయి, అందులో గ్రూప్‌లను పెద్దదిగా చేయడం మరియు అడ్మిన్‌లు వారు నిర్వహించే గ్రూప్‌లలో పంపిన మెసేజ్‌లను తొలగించే సామర్థ్యాన్ని అందించడం వంటివి ఉన్నాయి.

వాట్సాప్‌లో గ్రూప్స్ ఫీచర్ ను చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. ప్రతి ఫ్యామిలీకి, ప్రతి క్లాస్ కి, ప్రతి ఆఫీస్ ఇలా చాల రకాలుగా గ్రూప్స్ యూస్ అవుతున్నాయి. అలాంటి గ్రూప్స్ కి ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్స్ ను ఇస్తున్నట్టు whatsapp నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. ఇక మీదట నుండి గ్రూప్ లో ఎవరు చేరాలన్న విషయాన్ని అడ్మిన్ నిర్ణయించవచ్చు. గ్రూప్ లో ఎవరన్నా చేరాలంటే అడ్మిన్ పర్మిషన్ అవసరం. ఈ ఫీచర్ తీసుకొని రావడనికి whatsapp యూసర్స్ యొక్క సెక్యూరిటీ కోసమేనని, చాలామంది గ్రూప్స్ చాలా సీక్రెట్, ఇంటిమెట ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసుకుంటారు కాబట్టి ఈ ఫీచర్ ను whatsapp నిర్వాహకులు రోల్ అవుట్ చేయనున్నారు.
ఇప్పుడు ఈ communities వల్ల ఒకేసారి ఇన్ఫర్మేషన్ ను వేరే వేరే గ్రూప్స్ లలో షేర్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూషన్ ఏదంటే ఇద్దరు తాము ఇద్దరు మెంబర్స్ గా ఉన్న గ్రూప్స్ లేదా కమ్యూనిటిని చూడటానికి చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు రాబోతున్న కొత్త ఫీచర్ వల్ల ఈ సమస్య తీరనుంది. ఇప్పటికే ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. రానున్న రోజుల్లో అందరికీ అందుబాటులోకి రానుంది.