Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇంకా ఏపీలో చాలామంది ప్రజలు ఒక రాజకీయ నాయకుడిగా గుర్తించడం లేదు, గుర్తించడానికి ఇష్టపడటం కూడా లేదు ఎందుకంటే ఆయనకు మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పాలిటిక్స్ మీద లేదు. అందుకే తనకు మూవీస్ షూటింగ్ లేనప్పుడు వచ్చి పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వస్తున్న టైములో టీడీపీ, వైసీపీ విపరీతంగా వ్యూహాలు రచిస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం అసలు తనకు ఒక పొలిటికల్ పార్టీ కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోయి, మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కూడా వెళ్లినట్టున్నారు. మొన్నటి వరకు తనను ప్రజలు ఒంటరిగా వదిలేసారు, తనను అసెంబ్లీకి పంపించి ఉంటే, వాళ్ళ పక్షాన పోరాడి ఉండే వాడినని చెప్పాడు. కానీ ఇంకా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకుండానే ఇలా రాజకీయాలకు దూరంగా ఉంటూ, మూవీ షూటింగ్స్ చేసుకునే పవన్ ను ప్రజలు ఎందుకు గెలిపిస్తారనే వార్తలు వస్తున్నాయి.

అన్నీ మనోహర్ యే
జనసేనలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువగా మనోహర్ కనిపిస్తున్నారు. జనసేనలోని కార్యకర్తలతో మాట్లాడటం కానీ, గ్రామాల్లో, మండల స్థాయిలో పార్టీని బలపరచడంలో కానీ కేవలం నాదెండ్ల మనోహర్ మాత్రమే కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ లో బిజీ ఉంటె, పార్టీని దాదాపు నాదెండ్ల మనోహర్ నడిపిస్తున్నాడు. ఇలా అన్నింటికీ మనోహన్ ఉంటె ఇంకా పార్టీ లీడర్ ఆ పవన్ కళ్యాణ్ ఉండటం ఎందుకని జనసేన నాయకులే అంటున్నారు. అయినా ఒక్క నాదెండ్ల మనోహర్ తప్పా , పార్టీలో ఒక్క బలమైన నాయకుడు లేడు అయినా కూడా పవన్ పార్టీని పట్టించుకోరు. కనీసం పార్టీలో ఒక 10 మంది బలమైన నాయకులను పవన్ పార్టీ పెట్టిన 10 సంవత్సరాలలో తయారు చెయ్యలేకపోయాడంటే పవన్ పాలిటిక్స్ ఏ రేంజ్ లో చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఇలా ఉంటే దత్తపుత్రుడని అనరా!!
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని, దానికోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని పవన్ ఎప్పుడో చెప్పాడు. దింతో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఖాయమని అందరికి తెలుసు. అయితే ఎలాగో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు టీడీపీ కష్టపడుతుంది ఇంకా మనం కూడా కష్టపడటం అవసరమా అన్న నమ్మకంతో పవన్ ఉన్నదేమో అర్థం కావడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తు పెట్టుకున్నా కూడా పవర్ షేరింగ్ ఉంటుందని జనసేన కార్యకర్తలు అనుకుంటున్నారు. పవన్ ఇలా ఏమి చెయ్యకుండా ఉంటె, వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చెయ్యడం తప్పా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.