IPL: క్రికెట్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఐపీఎల్ ఈరోజు నుండి స్టార్ట్ కానుంది. ఇవ్వాళా అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ సీజన్లో మొదటి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ స్టార్టింగ్ ఈవెంట్ లో హీరోయిన్ తమన్నా భాటియా, రష్మిక మందనా కూడా డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తూ, మ్యాచ్ చూడటానికి వచ్చిన వారిని అలరించారు. అయితే గత రెండేళ్లు కరోనా వల్ల ఐపీఎల్ మ్యాచ్ లు వేరే కంట్రీలో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండేళ్ల తరువాత మళ్ళీ ఇండియాలో ఐపీఎల్ జరుగుతుండటంతో ఇండియన్ క్రికెట్ అభిమానులు మస్త్ కుష్ ఐతున్నారు. అలాగే మళ్ళీ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ తీసుకోవడంతో ఈసారి చెన్నైపై అభిమానులు గెలుపుపై చాల ఆశలు పెట్టుకున్నారు.

అలాగే లాస్ట్ సీజన్లో కప్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కు ఈసారి మళ్ళీ కప్ గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. టీం ఫారం అయిన మొదటిసారి కప్ గెలిచిన టీంగా గుజరాత్ కు క్రికెట్ అభిమానుల్లో క్రేజ్ ఉంది. అలాగే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ టీం లాస్ట్ సీజన్ విన్నింగ్ ను కంటిన్యూ చెయ్యడానికి సిద్ధమైనట్టు ఉన్నారు. అయితే ఇవ్వాళ జరుగుతున్నా మ్యాచ్ లో స్టేడియం మొత్తం ధోని అభిమానులతో నిండి పోయింది. రష్మిక డాన్స్ చెయ్యడానికి వచ్చినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే వచ్చిన రెస్పాన్స్ చెప్తుంది ధోని అభిమానులు ఎంతమంది ఉన్నారో అని. నాలుగుసార్లు కప్ గెలిచిన టీం ఈసారి కూడా కప్ గెలుస్తుందేమో చూడాలి. అలాగే గుజరాత్ జరుగుతున్న మ్యాచ్ లో తెలుగు పాటలైనా పుష్ప, rrr మూవీలోని పాటలకువినిపించడం తెలుగు ఇండస్ట్రీ రీచ్ గురించి చెప్తుంది.
టైటాన్స్ స్క్వాడ్
హార్దిక్ పాండ్య(కెప్టెన్), మాథ్యూ(వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, శుబ్ మన్ గిల్, కెన్ విల్లియసన్, రాహుల్ తేవతియా, రషీద్ ఖాన్, శివమ్ మవి, జోసెఫ్, మొహమ్మద్ షమీ, యాష్ దయాల్, శ్రీకర్ భరత్, వ్రిద్దిమాన్ సహా, సాయి సుదర్శన్, ఉర్విల్ పటేల్, విజయ్ శంకర్, రవిశ్రీనివాసన్, ఒడియాన్ స్మిత్, జయంత్ యాదవ్, జాషూవా లిటిల్, దర్శన్ నాల్కన్డ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, ప్రదీప్ సంగ్వాన్
చెన్నై సూపర్ కింగ్స్ టీం
ధోని(కీపర్ అండ్ కెప్టెన్), డెవాన్ కాన్వాయ్, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, బెన్ స్ట్రోక్స్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, సిమర్జీత్ సింగ్, అజింక్య రహానే, శుబ్రాన్షు సేనాపతి, షైక్ రషీద్, నిశాంత్ సింధు, మిట్చెల్ సెంట్ నిర్, భగత్ వర్మ, తుషార్ దేష్పాండే, రాజవర్ధన్, అజయ్ జాదవ్, ప్రశాంత్ సోలంకి, ఆకాష్ సింగ్