Kavitha: ఈడీ ఉపయోగించుకొని బీజేపీ పెడుతున్న ఇబ్బందులకు బీఆర్ఎస్ నాయకుల చిప్ దొబ్బినట్లుంది. అందుకే ఇష్టమొచ్చినట్టు, సంబంధం లేకుండా, లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు. ఈడీని బీజేపీ పెద్దలు వాడుకుంటున్నారు, ఈ విషయాన్నీ కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే, ఈడీ అధికారులు ఇప్పటి వరకు కవితను ఎక్కడా కూడా తప్పు చేసిందని చెప్పలేదు కేవలం అనుమానితురాలుగానే పరిగణిస్తున్నామని, ఆ కోణంలోనే విచారిస్తున్నామని చెప్తున్నారు. ఈ విషయాన్నీ బీజేపీ వాళ్ళు చేస్తున్న హడావిడి వల్ల ఎవ్వరు పట్టించుకోవడం లేదు. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ విషయాన్నీ ఎక్కడా బలంగా చెప్పడం లేదు. ఈడీని బీజేపీ వాడుకుంటుంది కాబట్టి, ఆ విషయాన్ని ప్రజలకు చెప్పి, బీజేపీ ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి, ప్రజల దగ్గర నుండి సింపతీ కొట్టెయ్యడానికి చూస్తున్నారు. బీఆర్ఎస్ బద్నామ్ చెయ్యడానికి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ బద్నామ్ చెయ్యడానికి బీఆర్ఎస్ తెగ కష్టపడి పోతున్నారు.
ఆడబిడ్డను విచారించరాదా!!
కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.తప్పు చేశారన్న వాళ్ళనైనా, తప్పు చేశారేమోనన్న అనుమానం ఉన్నవాళ్లను విచారిస్తారు. విచారించడంతో కుల, మత, జాతి, లింగబేధాలు ఉండవు. ఎవ్వరినైనా విచారించే అధికారం వాళ్లకు ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని బీఆర్ఎస్ నాయకులు ఆడబిడ్డను ఈడీ అధికారులు ఇష్టమొచ్చినట్టు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కావాలనే అన్ని గంటలపాటు విచారిస్తున్నారని బీఆర్ఎస్ మంత్రులైన శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు బీజేపీని తిట్టిన బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు మహిళా అనే సెంటిమెంట్ ను కూడా వాడుకోవడానికి సిద్ధమయ్యారు.
అంత ఉత్తదేనా!!
ఈ బీజేపీ నాయకులు దేశానికి ఎంత ప్రమాదకరమంటే… వాళ్ళు దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ, ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కవితను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిన్నటి వరకు కవిత లిక్కర్ స్కాం చేసిందని, అరెస్ట్ చేస్తున్నారని విపరీతంగా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు కవిత ధైర్యంగా తన ఫోన్స్ ను ప్రజలకు చూపిస్తూ, ఈడీ దగ్గరకు వెళ్ళింది. ఫోన్స్ పగలకొట్టిందని, అందులో చాలా ఇంపార్టెంట్ డేటా ఉందని బీజేపీ నాయకులు విపరీతంగా హడావిడి చేశారు. కానీ చూస్తుంటే కవిత విషయంలో బీజేపీ చేస్తూందంత ఉత్తదేనని తెలుస్తుంది.