TDP
TDP

TDP, Janasena: ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో రాజకీయ ముఖచిత్రం మార్చేస్తోంది. మొన్నటి వరకు టీడీపీ నాయకులు ఎంత నూన్యతా భావంతో కొట్టుకుంటున్నారో రాష్ట్ర ప్రజలు చూశారు. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఓటమి తప్పదని మొన్నటి టీడీపీ నాయకులు అనుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో వైసీపీలో భయం, టీడీపీలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. ఈ విజయాన్ని చూసి మొన్నటి వరకు వైసీపీ ఎంతో బలంగా చెప్తున్న “వై నాట్” 175 అంటున్న నినాదాన్ని ఇప్పుడు టీడీపీ నాయకులు పట్టుకున్నారు. వచ్చే ఎన్నికలో వై నాట్ 175 అనేంత ఉత్సాహాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీలో నింపాయి. పట్టభధ్రులు-ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలో టీడీపీ గెలిచిందంటే ఎదో అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అది కూడా ఎమ్మెల్యేల వల్ల వోటింగ్ వల్ల గెలవడంతో వైసీపీ నాయకులకు భయం పట్టుకుంది. అయితే టీడీపీ నూతన ఉత్సహంతో ఉంటె జనసేనలో ఖంగారు పెరుగుతుంది.

TDP, Janasean
TDP, Janasean

జనసేనలో భయం

వచ్చే ఎన్నికల్లో తనకు చాల ఇంపార్టెంట్ ఉంటుందని, తానె అధికారంలోకి వచ్చే వారిని డిసైడ్ చేస్తానని జనసేన లీడర్ పవన్ కళ్యాణ్, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా అనుకున్నారు కానీ ఇప్పుడు టీడీపీ వస్తున్న ప్రజాదరణను చూసి, జనసేనలో భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోకుంటే, టీడీపీకి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఓటమి తప్పదని, ఎలాగైనా టీడీపీనే తమ దగ్గరికి వస్తుందని, అప్పుడు తమకు కావాల్సినవన్ని డిమాండ్ చేయవొచ్చని పవన్ కళ్యాణ్ అనుకున్నారు కానీ ఇప్పుడు వస్తున్న టీడీపీ ఫలితాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ మళ్ళీ ఒంటరిగా పోటీ చేసినా, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉండకూడదని వైసీపీ అనుకుంటుందని, కానీ అదే ఖచ్చితంగా జరుగుతుందని పవన్ అన్నారు కానీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనతో కలుస్తుందో లేదో అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదంతా వైసీపీ ప్లానేనా!!

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా 175 స్థానాల్లో విజయం సాధించాలని వైసీపీ అనుకుంటుంది. కానీ ఈ మధ్య వస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాత్రం వైసీపీ అనుకుంటున్న దానికి పూర్తి వ్యతిరేకంగా వస్తున్నాయి. అయితే ఈ ఫలితాలు ఇలా రావడాన్ని కూడా వైసీపీనే డిజైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ తనకు బలం లేదని, ఖచ్చితంగా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది. అయితే ఒక్కసారి ప్రజల్లో తమకు ఇంకా బలం ఉందని, వైసీపీపై వ్యతిరేకత ఉందని తెలిస్తే, టీడీపీ పొత్తుకు వెళ్లకుండా ఉండే అవకాశం ఉందని, అది తమకు ప్లస్ అవుతుంది కాబట్టి, టీడీపీలో ప్రజాధారణ ఉందన్న భ్రమ కలిగించడానికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో జగన్ యే క్రాస్ వోటింగ్ చేయించాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విషయం నిజమో కాదో వైసిపికే తెలియాలి.

 

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 24, 2023 at 7:36 ఉద.