ROJA: ఏపీ రాజకీయల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంత హడావిడిని సృష్టిస్తాయని అస్సలు అనుకోలేదు. ఎలాగో వైసీపీని గెలుస్తుంది కదాని రాష్ట్ర ప్రజలు కూడా చాల రిలాక్స్ గా ఉన్నారు కానీ ఒక్కసారిగా టీడీపీ గెలవడంతో వైసీపీ నాయకుల్లో ఎక్కడ లేని భయంపట్టుకుంది. వైసీపీ వైల్డ్ డ్రీంలో కూడా ఊహించని విజయాన్ని టీడీపీ సాధించింది. ఈ విజయాన్ని టీడీపీ చాల పకడ్బందీగా, ఎక్కడా లీక్ అవ్వకుండా ప్లాన్ చేసినట్టుంది. అందుకే ఈ విజయం ఎఫెక్ట్ వైసీపీపై గట్టిగా పడింది. అయితే వైసీపీ తమలో ఉన్న భయాన్ని దాచుకుంటూ, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందులోను ముఖ్యంగా రోజా చాల గట్టిగా తమకేమి ఈ ఓటమి భయాన్ని కలిగించడం లేదని చెప్పడానికి చాలా గట్టిగా అరుస్తున్నారు కానీ ఆ భయం స్పష్టంగా కనిపిస్తుంది.

జగన్ వేటాడుతాడు
సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తె, పది అడుగులు ముందుకు వేస్తుందని, ఈ ఒక్క ఓటమితో జగన్ ను ఎవ్వరు ఏమి చెయ్యలేరని, రానున్న రోజుల్లో జగన్ వేటాడుతారని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు మాత్రం చాల తెలివి తక్కువ వ్యాఖ్యలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఊహించని పరిణామం పార్టీల జరిగినప్పుడు దాన్ని పరిశీలించి, దాని వల్ల కలిగిన నష్టాన్ని ఒప్పుకుంటూ,మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పాల్సిన నేతలు ఇలా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం ఎందుకని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎదో మూవీ అన్నట్టు వేరే వాణ్ని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావ్ కానీ నిన్ను నీవు మోసం చేసుకుంటే సంక నాకిపోతావ్ అని అలా ఇప్పుడు వైసీపీ నాయకుల ప్రవర్తన. వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటూ, పార్టీని బలహీనం చేస్తున్నారు.
రోజా ఉంటుందా వైసీపీలో!!
రోజాకు కూడా నియోజక వర్గంలో చాల వ్యతిరేకత వస్తుంది. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ తో రోజాకు చాలా గొడవలున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు ఆ గొడవల నిమిత్తం జగన్ దగ్గరకు కూడా రోజా వెళ్లారు. పైగా ఇప్పుడు రోజా ప్రజల్లో చాల వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోకుండా టీవీ షోస్ చెయ్యడం అలాగే, మంత్రి అయిన తరువాత కూడా పెద్దగా రాష్ట్రానికి మంచేమి చెయ్యకపోవడం వల్ల విపరీతమైన నెగటివిటీ వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ రోజాకు సీట్ ఇస్తాడా లేదా అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే జగన్ పై టీడీపీ జనసేన గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులకు జగన్ సీట్ ఇవ్వడు.సీట్ ఇవ్వకపోతే రోజా పార్టీలో ఉండటం కష్టమే, కాబట్టి వచ్చే ఎన్నికల సమయానికి రోజా వైసీపీలో ఉంటుందో లేదో చూడాలి.