Modi: దేశ ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్తాడని అందరికి తెలుసు. ఎన్నికల సమయంలో చేసిన ప్రామిసెస్ ను పక్కన పెట్టినా కూడా మాములు విషయాల్లో కూడా చాలాసార్లు అబద్ధాలు చెప్తూ అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయ్. ఒకసారి మాట్లాడుతూ… ఫస్ట్ డిజిటల్ కెమెరాను వాడింది తానేనని చెప్పాడు, కానీ అప్పటికి ఇంకా డిజిటల్ కెమెరా రాలేదు. ఆలాగే మెయిల్ ను కూడా తానూ వాడేవాడినని ఇలా ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెప్తూ లేదా జెన్ జితో కలవడానికి ఇలా ఉన్నవి లేనివి చెప్తూ మోడీ కాలం గడుపుతున్నాడు. ఇప్పుడు దేశంలో ఎడ్యుకేషన్ కూడా చాల ప్రైవేట్ విషయమైంది. నరేంద్ర మోడీ ఏమి చదువుకున్నాడు, అసలు ఆయన చదివిండా, లేదా,చదివితే ఆ సర్టిఫికెట్స్ ను చూపించమని, ఆయన చదవలేదని తమకు అనుమానంగా ఉందని అడిగిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హై కోర్ట్ 25000 రూపాయల జరిమానా విధించింది. అసలు ఒక దేశ ప్రధాని తన చదువుపై విమర్శలు వస్తున్నప్పుడు వాటిని చూపించకుండా కోర్ట్ కు వీళ్ళిందంటేనే అందులో ఎదో మాయ ఉందని అర్థమైతుంది.

అసలు ఇంటర్ ఐన పాస్ అయ్యాడా!!
నరేంద్ర మోడీని ఒక గొప్ప వ్యక్తి లెవెల్ లో బీజేపీ నాయకులు ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకే ఆయన చేసిన పనులను, చెయ్యని పనులను కూడా చెప్తూ ఉంటారు. అలాగే మోడీ మీద రాసిన బుక్ లో కూడా ఆయన మొసలితో ఫైట్ చేసినట్టు రాశారు. ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకేమైనా ఉంటుందా!!. ఇలాంటి అబద్ధాలు మోడీ, జేబీపీ ఎన్నో చెప్తాయి. ఇప్పుడు మోడీ తానూ డిగ్రీ 1978లో గుజరాత్ యూనివర్సిటీ నుండి పూర్తి చేశానని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఢిల్లీ యూనివర్సిటీ నుండి 1983లో పూర్తి చేశానని ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాల్లో మోడీ వెల్లడించారు. దీన్ని ఆధారంగా చేసుకొని అరవింద్ కేజ్రీవాల్ 2016లో సమాచార హక్కు చట్టం మోడీ విద్యార్హతలు చూపించాలని కోరారు. ఈ విషయాన్నీ గుజరాత్ యూనివర్సిటీ ప్రధాని పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వొచ్చా అని కోర్ట్ లో పిటిషన్ దాఖలు చెయ్యగా… దాన్ని విచారించిన జడ్జ్.. ప్రధాని పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన పని లేదని చెప్తూ.. అరవింద్ కేజ్రీవాల్ కుక్ 25000 జరిమానా విధించింది. ఐన చదివిండో లేదో అని అడిగిన్నందుకు జరిమానా విధించడం ఏంటో బీజేపీకే తెలియాలి.
కేటీఆర్ కామెడీ చేస్తున్నాడు
ఈ విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో మోడీపై పెద్ద ఎత్తున ట్రోల్ నడుస్తున్నాయి. చదువుకున్నాడో లేదో చెప్పమంటే ఫైన్ వెయ్యడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మినిస్టర్ కేటీఆర్ కు మోడీని ట్రోల్ చేస్తున్నాడు. తానూ పూణే యూనివర్సిటీలో చేసిన బయో టెక్నాలజీ లో మాస్టర్ డిగ్రీని, అలాగే సిటీ యూనివర్సిటీ అఫ్ న్యూ యార్క్ నుండి చేసిన బిజినెస్ మాస్టర్ డిగ్రీని చూపించమంటే చూపిస్తానని, కావాలంటే సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తానని ట్వీట్ చేశారు. ఇలా మోడీని సోషల్ మీడియా యూజర్స్ మాత్రమే కాదు పొలిటిషన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు.