NTR: ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీకి చోటు లేదు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు ఫ్యామిలినే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబెర్స్ ను పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని చాలామంది చెప్తూ ఉంటారు. ఐన ఎన్టీఆర్ పెట్టినా, దాన్ని ఇన్ని సంవత్సరాలుగా పార్టీని ముందుకు తీసుకెళ్తుంది బాబునేనని, ఇప్పుడు ఆ పార్టీ మీద పూర్తి హక్కు చంద్రబాబు ఫ్యామిలీకే ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో టీడీపీ నాయకులకు, చంద్రబాబు ఫ్యామిలీ మెంబెర్స్ కి ఎన్టీఆర్ ఫ్యామిలీ మీద, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మీద విపరీతమైన ప్రేమ కురిపిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు చంద్రబాబు ఫ్యామిలీ మెంబెర్స్ జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మొన్నటి వరకు ఎన్టీఆర్ ను టీడీపీ గేట్ దగ్గరికి కూడా రానివ్వని చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఇప్పుడు, ఎన్టీఆర్ ను పార్టీలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నారా అన్న డౌట్ తెలుగు ప్రజల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది.

మొన్న లోకేష్, నిన్న రోహిత్
జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ నాయకులు మొన్నటి వరకు ఎంత అవమానించారో అందరికి తెలుసు కానీ ఇప్పుడు టీడీపీలోని నాయకులంతా వరుసగా ఒకరి తరువాత ఒకరు ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మొన్న నారా లోకేష్ మాట్లాడుతూ… జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తామంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తామని చెప్పారు, నిన్న నారా రోహిత్ మాట్లాడుతూ… అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీలోకి వస్తాడని చెప్పారు. మొన్నటి వరకు ఎన్టీఆర్ ను అవమానించిన టీడీపీ నాయకులు, ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారని చర్చిస్తున్నారు. అయినా వాళ్ళ తాత పెట్టిన పార్టీలోకి ఎన్టీఆర్ ఈ చంద్రబాబు ఫ్యామిలీ ఆహ్వానించడం ఏంటని, పార్టీనే ఎన్టీఆర్ దని వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ అంటున్నారు.
ఓటమి భయమేనా!!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే రాష్ట్రంలో పార్టీకి పుట్టగతులుండవని టీడీపీ నాయకులకు కూడా తెలుసు. అందుకే ఇప్పటి నుండే వచ్చే ఎన్నికలో వైసీపీని ఓడించేదానికి ఉన్న ప్రతి మార్గాన్ని టీడీపీ వెతుకుంటుంది. ఆ వెతుకులాటలోనుండి వచ్చిందే జనసేనతో పొత్తు ఆలోచన కూడా. వైసీపీని ఓడించాలన్న ఆలోచన కంటే కూడా టీడీపీని బతికించుకోవడానికే జనసేనతో పొత్తు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు . ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా అందుకే టీడీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, ఎన్టీఆర్ కూడా పార్టీ కోసం పని చేస్తే ఎంతో కొంత పార్టీకి ఉపయోగపడుతుందని, అందుకే ఎన్టీఆర్ ను ఈ టీడీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఆహ్వానిస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.