TDP: జులాయి మూవీలో బ్రహ్మానందం ఏ దొంగతనం చేసినా కూడా యిట్టె దొరికిపోతుంటాడు అలాగే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో టీడీపీ నాయకులు వైసీపీ నాయకులకు అలా ఏ తప్పు చేసినా యిట్టె ఆధారాలతో సహా వెదవలు అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ ఓడించి, మళ్ళీ అధికారంలోకి రావాలని టీడీపీ నాయకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఏయే పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలో కూడా టీడీపీ నాయకులు వ్యూహాలు రచించారు. కానీ ఈమధ్య వైసీపీ ఇరికించాలని చూస్తూ టీడీపీ నాయకులే అడ్డంగా బుక్కైటున్నారు. మొన్న పట్టాభి విషయంలో, నిన్న అసెంబ్లీ విషయంలోనూ ఆధారాలతో సహా వైసీపీకి అడ్డంగా బుక్కైతున్నారు.

టీడీపీకి బుద్ధి రాదా!!
రాజకీయాల్లో తనకు 30 ఏళ్ల అనుభవం ఉందని, రాజకీయ వ్యూహాలు రచించడంలో తనను మించిన వాళ్ళు లేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ రెండు విషయాల్లో చాలా ఈజీగా దొరికిపోయి, మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. మొన్న పట్టాభి విషయంలో పోలీసులు అతన్ని విపరీతంగా కొట్టారని పాత ఫోటలను చూపిస్తూ ప్రచారం చేశారు. కానీ తరువాత అవి పాత ఫొటోస్ అని ప్రూవ్ కావడంతో టీడీపీ వాళ్ళు మీడియా ముఖంగా సారీ చెప్పారు. అలాగే ఇప్పుడు అసెంబ్లీ ప్రోటోకాల్ విషయంలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ముందుగా గవర్నర్ రావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చేంతవరకు స్పీకర్ ఛాంబర్ లో ఎదురుచూశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. గవర్నర్ కంటే ముఖ్యమంత్రే ముందుగా వచ్చారంటూ ప్రభుత్వం ఆడియో క్లిప్స్ తో సహా నిరూపించింది. ఇలా ప్రతి చిన్న విషయంలో టీడీపీ నాయకులు వెదవలు అవుతున్నారు.
ఇలా గెలిచేదెలా!!
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించి, మళ్ళీ అధికారంలోకి రావాలని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు కానీ ఇలా చీప్ గా బెహవె చేస్తే ఎలా రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఎంతో వైవిధ్యమైన వ్యూహాలతో ముందుకు వెళ్లాలని, ఇలా చిన్న చిన్న విషయాలలోనే దొరికిపోతే ఎలా ప్రశ్నిస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎవరితో పెట్టుకుంటున్నారో చెప్పి, వాళ్ళతో ఇప్పటి నుండే కల్సి పని చేస్తే మంచిదని రాజకీయ వర్గ్లు చెప్తున్నారు. వచ్చే ఎన్నికలో జనసేన, టీడీపీ పొత్తు ఆల్మోస్ట్ కంఫర్మ్ అయ్యింది. ఇంకా వాళ్ళు ప్రకటిస్తే రెండు నాయకులు కలిసి పని చేసుకుంటే, గెలిచే అవకాశం ఉంది.