is bjp party trying to stop groups exams

BRS, BJP: రాజకీయ నాయకులంతా పనికిమాలిన మనుషులు ఇంకెక్కడా ఉండరు. ఎందుకంటే వీళ్లకు ప్రతి ఒక రాజకీయ అంశమే, ఆ విషయం వాళ్ళు రాజకీయంగా ఎదగటానికి ఎంత వరకు పనికొస్తుందని చేస్తారే తప్పా, అందులో ఎవరున్నారు, ఉన్నవాళ్ళ మనోభావాల గురించి కానీ ఈ రాజకీయ నాయకులకు అవసరం లేదు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షా పేపర్ లీకేజీలో బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న చీప్ పాలిటిక్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. ఎందుకంటే ఎంతో నిరుద్యోగుల జీవితానికి సంబంధించిన విషయం, అందులో ఇలాంటి తప్పు ఎలా జరిగిందన్న దానిపై చర్చ లేకుండా ఒకరిని ఒకరు నిందించుకోవడానికి, ఒకరిని ఒకరు తిట్టుకోవడానికి ఈ విషయాన్నీ వాడుకుంటున్నారు. నిరుద్యోగుల జీవితాలు నాశనం అవుతున్నాయన్న బాధ ఒక్కరిలో కూడా కనిపించడం లేదు.

బీజేపీ నాయకులు ఇలాంటి విషయాను రాజకీయం చెయ్యడానికి ఎప్పుడూ ముందుంటుంది. ఎందుకంటే వాళ్లకు బీఆర్ఎస్ ను తిట్టడానికి ఒక రీసన్ కావాలి, దాన్ని వాడుకొని రాజకీయం చెయ్యాలి. మతరాజకీయాలు చేసే బీజేపీకి నిరుద్యోగుల గురించి ఆలోచించే టైం ఉండదు, కేంద్రం ఇస్తానని చెప్పి, ఇంకా నోటిఫికేషన్ ఇవ్వాకుండా ఎందుకుందో కేంద్రంలో ఉన్న పెద్దలను ప్రశ్నించే ధైర్యం ఉండదు కానీ ఇక్కడ వచ్చి, స్టూడెంట్స్ జీవితంతో రాజకీయాలు చేస్తారు. పేపర్ లీకేజీ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, దీన్ని కూడా రాజకీయం చేస్తూ, దాన్ని బీఆర్ఎస్ పైకి నెట్టడానికి చూస్తున్నారు.

ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా అధికారంలో ఉండి కూడా పేపర్ లీకేజీ విషయంలో బీజేపీని తప్పు పడుతున్నారు. పేపర్ లీకేజీ విషయంలో పట్టుపడ్డ వారిలో బీజేపీ వాళ్ళు ఉన్నారని, బీజేపీలోని పెద్దలే పేపర్ లీకేజీ చేయించారని, ఈ కోణంలో దర్యాప్తు చేయించాలని అధికారులను కోరుతున్నారు. దింతో బీజేపీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి, ఆ నిందితుల్లో ఒకరు బీఆర్ఎస్ సర్పంచ్ కూతురని అంటున్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఇష్టమొచ్చినట్టు నెట్టుకుంటూ, స్టూడెంట్స్ జీవితంతో ఆడుకుంటున్నారు. ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేసే వాళ్ళు ప్రజాసేవ చేస్తామంటూ ముందుకు వస్తున్నారు.