Chiranjeevi: ‘ఇది అడుక్కు తినడం కాదు’..అని చిరు అన్న మాట..ఎంత మందిని బాధిస్తుందో..

G K

Chiranjeevi: తాజాగా ఆచార్య సినిమా ప్రీ ప్రెస్ మీట్‌లో అన్న మాట ఇండస్ట్రీ వర్గాలనే కాదు, అభిమానులను..ప్రేక్షకులను ఎంతో బాధిస్తోంది. కరోనా ప్యాండమిక్ కారణంగా సినిమా ఇండస్ట్రీలన్నీ ఎంతగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయో అందరికీ తెలిసిందే. అయితే, చాలా వరకు బడ్జెట్ సినిమాలన్నిటికీ ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించడం వల్ల వసూళ్ళపరంగా దెబ్బ పడుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ విషయంలో ఏపీ ప్రభుత్వం అమలు చేసీ జీవో, ఇచ్చిన అనుమతులు ఎంత నష్టాలను మిగిల్చాయో అందరికీ తెలిసిందే.

అయితే, ఒకటికి నాలుగు సార్లు చిరంజీవి వెళ్లి జగన్‌తో చర్చలు జరిపి ఒక స్థాయికి తీసుకువచ్చారు. దానివల్ల ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్ ధరలను, అదనపు షోలకు అనుమతులు ఇచ్చాయి రెండు ప్రభుత్వాలు. అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా రూ 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా. కాబట్టి..టికెట్ ధరలను పెంచినా కూడా జనం ఏమని ప్రశ్నించలేదు. అయితే, తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆచార్య సినిమాకు తెలంగాణ – ఏపీ ప్రభుత్వాలు 10 రోజుల పాటు అదనపు షోలు, టికెట్ ధరలను పెంచుకోవచ్చు అని అనుమతులిచ్చాయి. ఇదే విషయం ప్రీ ప్రెస్ మీట్‌లో చర్చకు వచ్చింది.

will chiranjeevi-comments hurts many people
will chiranjeevi-comments hurts many people

Chiranjeevi: ఈ విషయంలో మెగాస్టార్‌ను ఎంత మెచ్చుకున్నా ఎంత పొగిడినా తప్పులేదు.

ఓ విలేకరి మీ సినిమా అంటే ఎక్కడైనా హౌజ్ ఫుల్ అవడం ఖాయం. అలాంటిది ఆచార్య సినిమాకు కూడా టికెట్ ధరలు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. దీనికి మెగాస్టార్ చెప్పిన సమాధానం..కరోనా ప్యాండమిక్ వల్ల షూటింగ్స్ ఆగిపోయినా కూడా ఫైనాన్స్ తెచ్చిన డబ్బుకు మాత్రం భారీగా వడ్డీ అయింది. అది ఎవరిస్తారు. అందుకే ప్రభుత్వాలు కనికరించి ఈ అవకాశం ఇచ్చారు. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా..ప్రేక్షకులు కూడా రూ.10 పెట్టి చూసిన తప్పులేదనుకుంటారు. ఇది అడుక్కోవడం ఎలా అవుతుందీ అన్నారు. చిరంజీవి నోట ఈ మాట వచ్చినప్పటినుంచి సినీ వర్గాలలో రక రకాల చర్చలు మొదలయ్యయాయి. అభిమానులు, ప్రేక్షకులు ఈ మాటకు ఎమోషనల్ అవుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీని బ్రతికించడం కోసమే చిరంజీవి అన్ని సార్లు తన స్థాయిని పక్కన పెట్టి కూడా జగన్ వద్దకు వెళ్ళారు. ఈ విషయంలో మెగాస్టార్‌ను ఎంత మెచ్చుకున్నా ఎంత పొగిడినా తప్పులేదు.

- Advertisement -