Gunashekhar : గుణశేఖర్ అంటే ఇండస్ట్రీలో ఒక రేంజ్ అండ్ క్రేజ్ ఉంది. ఆయన సినిమా అంటే కథ..ఆ కథతో కథలో కీలకమైన ఓ సెట్ ముందు ఫిక్సవ్వాలి. అలా గుణశేఖర్ ఓ క్రేజ్ సృష్ఠించుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్ళు అయింది. కానీ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవి తో రెండు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఒకటి చూడాలని ఉంది. మరొకటి మృగరాజు. చూడాలని ఉంది సూపర్ డూపర్ హిట్. మృగరాజు పెద్ద డిజాస్టర్. ఈ సినిమా ఫ్లాప్ మెగాస్టార్ ని ఆయన అభిమానులను ఎంతగా డిసప్పాయింట్ చేసిందో అప్పట్లో వచ్చిన కామెంట్స్ చూసిన వాళ్లకి తెలుస్తుంది.

will gunashekhar gets the chance...?

అలాగే చూడాలని ఉంది అంటే ముందు ఎవరికైనా గుర్తొచ్చేది ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన కలకత్త సెట్. ఇక ఒక్కడు సినిమా కి వేసిన చార్మినార్ సెట్, అలాగే గండిపేట్ లో సూపర్ స్టార్ కృష్ణ సొంత లాండ్ లో వేసిన అర్జున్ సినిమాలోని మధుర మీనాక్షి టెంపుల్ సెట్ ఎంతో ప్రముఖంగా చెప్పుకుంటారు. ఇక బాహుబలి తర్వాత అలాంటి భారీ సెట్స్ కనిపించింది అంటే గుణశేఖర్ రూపొందించిన రుద్రమదేవి సినిమాలోని సెట్స్. ఇప్పుడు శాకుంతలం సినిమా తెరకెక్కిస్తుండగా మలయాళ నటుడు దేవ మోహన్, సమంత కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు.

Gunashekhar : మెగాస్టార్ గుణశేఖర్ కి ఛాన్స్ ఇవ్వగలరా అనేది ఆసక్తికరంగా మారింది.

చాలా వరకు సినిమా షూటింగ్ జరిగిందట. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ఇందులో ఒక భాగం అయ్యాడు. ఆయన సమర్పిస్తుంటే నీలిమ గుణ హైయ్యెస్ట్ బడ్జెట్ కేటాయించింది చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తవక ముందే గుణశేఖర్ ..చిరంజీవికి కథ చెప్పాలని చూస్తున్నాడట. ఆయన సమయం ఎప్పుడు ఇస్తారో అని డైరెక్టర్ గుణశేఖర్ వెయిట్ చేస్తున్నాడట. ఆయన ఓకే అనగానే కథ చెప్పడానికి ఏమాత్రం ఆలోచించనని ఇటీవలే వెల్లడించారు. అయితే యంగ్ డైరెక్టర్స్ కి ఎక్కువగా అవకాశాలిస్తూ ఎంకరేజ్ చేస్తున్న మెగాస్టార్ గుణశేఖర్ కి ఛాన్స్ ఇవ్వగలరా అనేది ఆసక్తికరంగా మారింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 6, 2021 at 10:15 సా.