KCR: మొన్న ఖమ్మంలో పెట్టిన సభతో దేశం మొత్తం బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకునేలా చేశారు. దేశ స్థాయిలో తనకు ఎంతమంది నాయకులు మద్దతు తెలుపుతున్నారో కూడా బీజేపీకి తెలిసేలా చేశారు. ఖమ్మం తెలంగాణ కాబట్టి, ఇక్కడ ఉన్న తన పార్టీ కార్యవర్గాన్ని ఆ కార్యక్రమానికి బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏకంగా బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ లో సభ పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ శివసేన, బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు అక్కడ సభ పెట్టడానికి కేసీఆర్ సిద్ధం కావడంతో, ఈసభపై అప్పుడే రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ఖమ్మం అంటే తన రాష్ట్రం కాబట్టి తన బలాన్ని చూపించుకున్నాడు కానీ ఇప్పుడు బీజేపీ ప్రాంతంలోకి అక్కడ కేసీఆర్ కు బీజేపీ నుండి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న అంశంపై ఇప్పుడు చర్చలు జరుగున్నాయి.

KCR
KCR

నాందేడ్ లో సక్సెస్ అవుతాడా!!

ఖమ్మంలో కాబట్టి భారీగా కేసీఆర్ కోసం జనాలు వచ్చారు. ఇప్పుడు నాందేడ్ లో పెట్టె సభకు అసలు జనాలు వస్తారా అన్నది ప్రశ్న. ఎందుకంటే అక్కడి ప్రజలకు కేసీఆర్ గురించి కానీ, కేసీఆర్ పాలన గురించి పెద్దగా తెలిసి ఉండదు. అలాంటి ప్రాంతంలో కేసీఆర్ సభ పెడితే అక్కడి జనాలు వస్తారో లేదో చూడాలి.మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ ను బలోపేతం చెయ్యడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో చత్రపతి సాహు మహారాజ్ మనవడు, మహా మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ ఇప్పటికే భేటీ అయ్యారు. ఈ నేతలు ఒకవేళ బీఆర్ఎస్ లో చేరితే మాత్రం కేసీఆర్ ఇక్కడ ఎంతో కొంత బలం చేకూరుతుంది. మొన్న ఖమ్మంలో జరిగిన సభకు కేరళ సీఎం, పంజాబ్ సీఎం, ఢిల్లీ సీఎంలు వచ్చారు. మరి ఇప్పుడు ఇక్కడ జరిగే సభకు ఎవరెవరు రానున్నారో చూడాలి.

సభ ఎప్పుడంటే!!

మొదటగా నాందేడ్ సభను ఈనెల 29న పెట్టడానికి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న కారణంగా ఆ రోజు సభకు అనుమతి అధికారులు ఇవ్వకపోవడం వల్ల వచ్చే నెల 6 న సభను నిర్వహించడానికి బీఆర్ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నాందేడ్ లో జరగనున్న సభ కోసం గత మూడు రోజులుగా మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి సభను సక్సెస్ చేయడానికి కావలసిన సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఫిబ్రవరి 5న కేసీఆర్ గురుద్వార్ లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.