Puri Jagannath – Pooja Hegde: పూరికి పూజా వర్కౌట్ అవుతుందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి సందేహాలే వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన. ఈ సినిమాను టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ దేవరకొండ – పూరి కాంబోలో బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఈ ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషలలో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
అయితే, లైగర్ సినిమా సమయంలో పూరి – విజయ్‌ల మధ్య ఏర్పడిన బాండింగ్ కారణంగా పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే దాదాపు కన్ఫర్మ్ అయిందని సమాచారం. పూరికి పూజా డేట్స్ కూడా ఇచ్చిందట. రెమ్యునరేషన్ కూడా ఫైనల్ అయిందని భారీగానే బుట్టబొమ్మకి దక్కుతుందని తెలుస్తోంది. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా పూజా చేతిలో కొత్త ప్రాజెక్ట్స్ పడుతున్నాయి.

Puri Jagannath – Pooja Hegde: పూజాను తీసుకోవడం హాట్ టాపిక్..
ఇప్పటికే మహేశ్ బాబు – త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా ఫైనల్ అయింది. అలాగే, హరీశ్ శంకర్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల సినిమాలోనూ పూజానే హీరోయిన్. అయితే, ఈ సినిమాల కంటే ముందే పూరి – విజయ్ దేవరకొండల సినిమా జనగణమన సెట్స్‌లో అడుగుపెట్టబోతుందట. సాధారణంగా పూరి సీనియర్ హీరోయిన్స్‌ను ఎంపిక చేసుకోరు. వీలైనంతవరకు ముంబై నుంచి కొత్త సరుకునే తెచ్చుకుంటుంటారు. కానీ, ఇప్పుడు పూజాను తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలతో వరుసగా ఫ్లాస్ చూసిన పూజా మన పూరికి వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.