YS JAGAN MOHAN REDDY

YCP: దేశంలోనే చీప్ పాలిటిక్స్ ఏపీలోనే జరుగుతున్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇది కూడా ఒక రాష్ట్రమే కాబట్టి ఇక్కడ కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు ఏపీలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే బడ్జెట్ జరుగుతున్న సమయంలోనే టిడిపి నేతలు సభ నుండి వాక్ అవుట్ చేశారు. అయితే ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను ప్రవేశపెడుతుంటే, అది చూడటం ఇష్టం లేకపోవడం వల్లే టిడిపి వాళ్ళు అలా వెళ్లిపోయారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే బడ్జెట్ ను జగన్ ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకునే రూపొందించామని వైసీపీ నాయకులు చెప్తున్నారు.

ys jagan mohan reddy

విద్యా, వైద్యమే మా ప్రాధాన్యత

పెత్తందారి వ్యవస్థ నుండి పేదవాడికి రక్షణ కలిపించడమే లక్ష్యంగా పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని వైసీపీ నాయకుడైన బొత్సా సత్యనారాయణ తెలిపారు. ఈ బడ్జెట్ లో ముఖ్యంగా విద్యకు, వైద్యానికి ప్రాముఖ్యత ఇచ్చామని వైసీపీ నాయకులు చెప్తున్నారు. వైద్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని బొత్స తెలిపారు. విద్య ఈ ప్రభుత్వం ప్రాధాన్యతా అంశమన్నారు. విద్యా రంగానికి 32వేల కోట్లను ఈ బడ్జెట్ లో కేటాయించారన్నారు. ఎక్కడ విద్యాధికులు ఉంటారో ఆ రాష్ట్రం ఎంతో వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో వనరులను సమకూర్చుకోవడం కోసం ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నామన్నారు. సామాన్యుల కోసం సంక్షేమం అందించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశామని బొత్స తెలిపారు.

టిడిపి వాళ్ళకు బుద్ధి లేదు

టిడిపి నాయకులు అస్సలు చిత్తశుద్ది లేని నాయకులని సమాచారం మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రజల గురించి ఆలోచించే నాయకులైతే బడ్జెట్ సమావేశాల నుండి అలా ఎందుకు వెళ్తారని వేణుగోపాల్ ప్రశ్నించారు. బడ్జెట్ ను ప్రవేశ పెట్టడంలోనో, నిధులు కేటాయించడంలోనో తప్పులు జరిగితే చెప్పాల్సిన వాళ్ళు ఇలా పిరికివాళ్ళలా సభను వదిలి ఎందుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నాయకులకు ఇదంతా చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ ఇస్తున్నాడని, అందుకే ఆ పార్టీలోని నాయకులు ఇలా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బడ్జెట్ పై టిడిపి నాయకులు, జనసేన నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో వేచి చూడాలి.