Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs: ఫిబ్రవరి 12, 2023 పంచాగం

తేది : 12, ఫిబ్రవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : ఆదివారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : షష్టి ఉదయం 9.46ని.
నక్షత్రం : చిత్తా ఉదయం 1.40ని. స్వాతి
వర్జ్యం : ఉదయం 8.05ని॥ నుంచి 9.42ని॥ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 5.02ని నుండి 5.53ని.
రాహుకాలం : సాయంత్రం 4.30ని.ల నుంచి 6.00ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 12.19ని.ల నుంచి 1.59ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.48ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.12ని.ల వరకు

మేషరాశి: ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థికంగా చాలా ఖర్చులు చేస్తారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్లకు ఈరోజు కుదుటపడుతుంది. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు. సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా నష్టాలు ఉన్నాయి. స్నేహితులు మోసం చేస్తారు. కొన్ని విషయాలు త్వరగా తెలుసుకోవాల్సి ఉంటుంది. పనులు సక్రమంగా పూర్తయ్యేలా చూసుకోవాలి. ఉద్యోగస్తులు తొందర పడకూడదు. కొన్ని విషయాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిధున రాశి: ఈ రాశి వారు ఎటువంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువులతో అనవసరంగా వాదనలకు దిగకూడదు. చేపట్టిన పనులు సక్రమంగా పూర్తయ్యేలా చూసుకోవాలి. కొత్త వ్యాపారాలు ఈరోజు మొదలవుతాయి.

Zodiac Signs
Zodiac Signs

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా పొదుపు చేస్తారు. బిజినెస్ వైపు అడుగు పెట్టాలనుకునే వాళ్లకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా ఉండవు. మీరు పనులు వాయిదా వేసుకోవద్దు.

సింహరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని కోర్టు సమస్యల నుండి ఈరోజు బయటపడతారు. తీరికలేని సమయంతో గడుపుతున్న వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది. కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కన్య రాశి: ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఒక శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు. ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు. రక్తసంబంధికులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. సమయాన్ని కాపాడుకోవాలి.

తుల రాశి: ఈ రాశి వారు తీరిక లేని సమయంతో గడుపుతారు. పిల్లల భవిష్యత్తు గురించి నిర్లక్ష్యం చేయకూడదు. ఏ పని చేసిన ఆలోచించి చేయాలి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమయం అనుకూలంగా ఉంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఇతరుల సహాయం అందుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రశంసలు అందుతాయి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు. మీ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఒక శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మకరరాశి: ఈ రాశి వారు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనారోగ్య సమస్యతో బాధపడే వాళ్లకు ఈరోజు కాస్త ఉపశమనం కలుగుతుంది. ఆర్థికంగా ఇతరుల సహాయం అందుకుంటారు. తోబుట్టువులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఒక వార్త మిమ్మల్ని బాధ పెడుతుంది. తల్లిదండ్రులతో అనవసరంగా వాదనలకు దిగుతారు. కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

మీన రాశి: ఈ రాశి వారికి ఇతరుల సహాయం అందుతుంది. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు పనికిరావు. వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి. పిల్లలతో సమయాన్ని గడపాలి. శత్రువులను వీలైనంత దూరంగా ఉంచాలి. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.

Akashavani

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...