Allu Arjun-Sneha Reddy : నిన్న మొన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా పేరు ఎంత మారుమోగింది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటర్నేషనల్ క్రికెటర్స్, సెలబ్రిటీలు సైతం పుష్ప సాంగ్స్ కి రీల్స్ చేశారంటే బన్నీ క్రేజీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ టాలీవుడ్ హీరో కాదు..పాన్ ఇండియా హీరో .. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోతుందని ముందే భావించి డైరెక్టర్ సుకుమార్.. బన్నీ స్టైలిష్ స్టార్ ట్యాగ్ ని ఐకాన్ స్టార్ గా మార్చాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే బన్నీకి పుష్ప సినిమాకు ముందు సౌత్ లోని కన్నడ తమిళ్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది..కానీ పుష్పా సినిమా తర్వాత నార్త్ సౌత్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా బన్నీ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరోగా అయిన ప్రభాస్ తర్వాత రెండో పాన్ ఇండియా హీరో అల్లు అర్జునే కావడం విశేషం. ఈ నేపథ్యంలో బన్నీకి ఇండస్ట్రీలో భారీగా డిమాండ్ పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహారెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వీరిద్దరూ తీసుకొని దాదాపు 11 సంవత్సరాలు దాటిపోయింది. వీరికి ఆద్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే స్నేహారెడ్డి స్టైలిష్ లో, గ్లామర్ లో అల్లు అర్జున్ కి తగ్గట్టుగానే వ్యవహరిస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ.. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి స్టైలిష్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి హాలిడే కి వెళ్లారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి.
.