Anchor Bhanu Sree : బులితెర లోకి పటాస్ అనే టీవీ షోతో యాంకర్ గా పరిచయమైన భాను శ్రీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే భాను శ్రీ గురించి అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. భాను మొదట యాంకర్ అవుదామని కాకుండా యాక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
వచ్చిన కొత్తలో రెండు మూడు చిత్రాల్లో కూడా నటించింది. కానీ అవి అంతగా ఆడలేదు. దీంతో భాను శ్రీ అందంగా ఉండడంతో యాంకర్ గా అవకాశాలు వచ్చాయి. ఈ మేరకు ఆవకాశాలు సద్వినియోగం చేసుకొని యాంకర్ గా భాను శ్రీ సక్సెస్ అయింది.
అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో నెట్టింట్లో వైరల్ గా మారుతాయి. ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ బుల్లితెరలోనే కాకుండా వెండితెర పై పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన టెన్త్ క్లాస్ డైరీస్ మూవీలో ఐటమ్ సాంగ్ లో భాను శ్రీ రెచ్చిపోయింది.
ఆ చిత్రంలో అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అంజి దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే తాజాగా అందాలను చూపిస్తూ భాను శ్రీ కెమెరాకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.