Anchor Sreemukhi : ఫేమస్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.
బుల్లితెర లో రష్మి అనసూయ తర్వాత అంతటి క్రేజ్ ఉంది ఈ యాంకర్ శ్రీముఖి కి.. వయసులో చిన్నదైనా శ్రీముఖి.. యాంకరింగ్ ఫీల్డ్ లో అనసూయ రష్మీ లకు గట్టి పోటీని ఇస్తుంది.
స్టార్ హీరోయిన్ తీసిపోని పాపులరిటి ఉన్న ఈ యంకర్.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ అయినా శ్రీముఖి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన ఓ సంచలనమే…
ఇటీవల బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని.. శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. టైటిల్ గెలవడానికి రాహుల్ సిప్లిగంజ్ కి శ్రీముఖి గట్టి పోటీ ఇచ్చింది. అయితే ముద్దుగుమ్మకు ఈ బిగ్బాస్ ట్రోఫీ మిస్సయిన.. రెమ్యూనరేషన్ లో మాత్రం భారీగానే సంపాదించింది.
శ్రీముఖి కెరియర్ కి ఈ బిగ్ బాస్ ఏంతో ఉపయోగపడిందనే చెప్పాలి. ఆ షో లో నుండి బయటకు వచ్చిన తర్వాత.. శ్రీముఖి కి అవకాశాలు క్యూ కట్టాయి. ఈ హాట్ యాంకర్ హీరోయిన్ గా కూడా ఇటీవల ఎంట్రీ ఇచ్చింది. క్రేజీ అంకుల్స్ చిత్రంలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
ఈ ముద్దుగుమ్మ బిజినెస్ లో కూడా రాణిస్తుంది. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించింది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో ఫోటోలు నెట్టింట్లో వైరల్ మారాయి.