Anjali : తన అందం అభినయంతో టాలీవుడ్లో ది మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ గా అంజలి పేరు సంపాదించుకుంది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో అంజలికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు. ఆ సినిమాలో సీత పాత్రలో అంజలి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అచ్చం తెలుగు అమ్మాయి గా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు..పలు చిత్రాల్లో నటించిన.. అవి అంతగా ఆడకపోవడంతో..అంజలి కెరీర్ పట్టాలు తప్పింది.
దీంతో కొన్ని నెలలు అంజలి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఈ బ్యూటీ జై అనే వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించి పలు చోట్లకు చెట్టపట్టాలేసుకుని తిరగడంతో మీడియా కంట పడింది. దీంతో తప్పని పరిస్థితుల్లో తన ప్రేమ విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం కూడా చేశారు. అలా కలిసి ఉన్న కొద్దీ రోజులకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో.. వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. మళ్లీ అంజలి సినిమాలపై దృష్టి పెట్టింది. సినిమా అవకాశాలు రావడానికి కసరత్తులు చేసి స్లిమ్ గా మారింది అంజలి.. ఇదిలా ఉంటే తాజాగా ఘాటైన ఎద అందాలను చూపిస్తూ అంజలి రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో అంజలి ఒక కీలక పాత్రలో నటించింది. అయితే అంజనీ సినీ కెరియర్ లో ఒక స్టార్ హీరో వాడుకొని వదిలేసాడన్న మచ్చ మాత్రం పడిపోయింది. బ్రేకప్ తర్వాత అంజలి గ్లామరస్ రోల్స్ లో కూడా నటించడానికి వెనకాడటలేదు.
మునుపటి కన్నా ఇప్పుడు గ్లామర్ డోస్ చాలా పెంచి కుర్రకారులకు పిచ్చెక్కిస్తుంది. తెలుగులో బలుపు, గీతాంజలి, శంకరాభరణం, డిక్టేటర్, చిత్రాంగద, నిశ్శబ్దం లాంటి సినిమాల్లో కూడా అంజలి నటించింది. ఇక ప్రస్తుతం తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటిస్తుందట. అలాగే తమిళ్, మలయాళం, కన్నడలో కూడా పలు చిత్రాల్లో నటిస్తుందని సమాచారం